బయటికేమో జెంట్స్ బ్యూటీ పార్లర్: లోపల ఏం జరుగుతుందో తెలిస్తే షాక్?..

దాడి సమయంలో నలుగురు పేకాట రాయుళ్లను పోలీసులు పట్టుకోగా.. మరో ఇద్దరు తప్పించుకున్నారు.

హైదరాబాద్‌: బయటికేమో అదో బ్యూటీ పార్లర్.. లోపలేమో క్లబ్ తరహా కార్యకలాపాలు.. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పక్కాగా ఓ సెటప్ ఏర్పాటు చేసుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయటపడ్డ ఓ పేకాట స్థావరంలో విస్మయం చెందే విషయాలు వెలుగుచూశాయి.

వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న ఓ జెంట్స్ బ్యూటీ పార్లర్‌పై పోలీసులు దాడి చేశారు. లోపల ఓ సీక్రెట్ గదిని ఏర్పాటు చేసుకుని.. అందులో పేకాట ఆడుతున్నట్లుగా గుర్తించారు. దాడి సమయంలో నలుగురు పేకాట రాయుళ్లను పోలీసులు పట్టుకోగా.. మరో ఇద్దరు తప్పించుకున్నారు.

four held for playing cards inside gents beauty parlour

పార్లర్ నిర్వాహకుడు ప్రసాద్.. అందులో సీక్రెట్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పార్లర్ కు వచ్చే పోయేవారి రాకపోకలు గమనించేందుకే నిర్వాహకుడు కెమెరాలు ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. కెమెరా రికార్డింగ్స్ ను ప్రసాద్ తన మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+