వారికి నాలుగు లక్షల రూపాయలు..ఈ స్కీమ్ తో దూసుకుపొండి!
తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన కలిగించే దిశగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. రాజీవ్ యువ వికాసం పథకం పేరుతో యువత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, వారు వివిధ యూనిట్లు నెలకొల్పి స్వావలంబన పొందడానికి కావలసిన ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఐదులక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది.
రాజీవ్ యువ వికాసం స్కీమ్
రాజీవ్ యువవికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయనుంది ప్రభుత్వం. ఒక్కొక్కరికి 50వేల రూపాయల నుండి నాలుగు లక్షల రూపాయల వరకు వివిధ యూనిట్లను నెలకొల్పుకోవడానికి ఆర్థికసహాయాన్ని అందించనున్నారు. ఒక్కొక్క యూనిట్ కు 60శాతం నుండి 100శాతం వరకు సబ్సిడీ ఇవ్వడమే కాకుండా మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా అందిస్తుంది.

ఈ స్కీమ్ లో భారీ రాయితీ
50 వేల రూపాయల వరకు ఖర్చు ఉండే యూనిట్ కు ప్రభుత్వం 100% రాయితీ ఇస్తుంది. 50000 పైనుంచి లక్ష రూపాయల ఖర్చు ఉండే యూనిట్ ఏర్పాటుకు 90% రాయితీ, 10% బ్యాంకు ద్వారా రుణాన్ని ఇస్తుంది. లక్ష ఒక రూపాయి నుండి రెండు లక్షల రూపాయల వరకు ఉండే యూనిట్ కు ప్రభుత్వం 80 శాతం సబ్సిడీని ఇస్తుంది. 20% మాత్రమే బ్యాంకు రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
నాలుగు లక్షల వరకు లోన్స్
రెండు లక్షల ఒక రూపాయి నుండి నాలుగు లక్షల రూపాయల వరకు ఏర్పాటు చేసే యూనిట్ కు ప్రభుత్వం 70 శాతం సబ్సిడీని ఇస్తుంది. 30% బ్యాంకు రుణం ఇస్తుంది. ఇక వల్నరబుల్ గ్రూప్స్ కు లక్ష వరకు 90% ప్రభుత్వ సబ్సిడీని ఇచ్చి 10 శాతం emf గా ఇస్తుంది. మైనర్ ఇరిగేషన్ వంద శాతం ప్రభుత్వ సబ్సిడీని ఇస్తుంది.
వారికి నైపుణ్య శిక్షణ
ఈ పథకాన్ని యువతకు అందించడం కోసం రాష్ట్రప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించింది. వివిధ యూనిట్లను నెలకొల్పాలి అనుకునే వారికి ఆయా రంగాలలో నైపుణ్య శిక్షణను 15రోజులపాటు అందించి వారికి లబ్ది వారికి లబ్ధి చేకూర్చనున్నారు.ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే యువత తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసిగా ఉండాలి. నిరుద్యోగులు అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబిసి, మైనారిటీ వర్గాలకు చెందిన వారే ఉండాలి.
రాజీవ్ యువ వికాసం అర్హతలు ఇవే
కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే 1.5 లక్షల లోపు, పట్టణ ప్రాంతాలలో అయితే రెండు లక్షల లోపు ఉండాలి. గతంలో ఎటువంటి రాయితీ రుణాలు తీసుకున్న వారు అర్హులు కారు. ఒకవేళ రాయితీ రుణాలు తీసుకున్న వారు ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.
ఈ వయసుల వారికే అవకాశం
ఒక కుటుంబం నుండి ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో అత్యంత పేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. సంబంధిత రంగంలో అనుభవం నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. వ్యవసాయ రంగాల వారైతే 21 ఏళ్ల నుండి 60 ఏళ్ల మధ్య, వ్యవసాయ ఇతర రంగాలకు చెందిన వారైతే 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ దరఖాస్తు
దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేదా ఆదాయ ధ్రువపత్రం, కుల దృవపత్రం, బ్యాంకు పాస్ పుస్తకం, పట్టాదారు పాస్ పుస్తకం, బలహీనవర్గాల ధ్రువపత్రం, దివ్యాంగులు అయితే సదరం ధృవపత్రం మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా యువత భారీ రాయితీలతో ఆర్థిక భరోసాను పొందవచ్చు.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications