కాంగ్రెస్ గూటికి మ‌రో న‌లుగురు గులాబీ ఎంపీలు..! ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్ కి షాక్..!!

హైద‌రాబాద్: తెలంగాణ ఎన్నిక‌ల్లో అదికార గులాబీ పార్టీ దూసుకెళ్తుంటే ఆ పార్టీ నేత‌ల తీరు పార్టీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చుతోంది. తెలంగాణ‌లో మ‌రోసారి అదికారం లోకి వ‌చ్చేందుకు ఆప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు చేస్తున్న పోరాటంలో భాగం పంచుకోక‌పోవ‌డ‌మే కాకుండా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. దీంతో చంద్ర‌శేఖ‌ర్ రావు పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా పార్టీ ప్ర‌తినిధులు న‌డుచుకుంటున్నార‌నే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. నిన్న పార్టీ మారిన విశ్వేశ్వ‌ర్ రెడ్ది తో పాటు మ‌రో ముగ్గురు ఎంపీలు కూడా గులాబీ గూటిని ఒదిలేందుకు సిద్దంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారం తారాస్థాయిలో జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఇలాంటి జంపిగ్స్ అదికార పార్టీకి న‌ష్ట‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎన్నిక‌ల ముందు అదికార పార్టీకి షాక్.. !పార్టీ మారుతున్న గులామీ ఎంపీలు..!!

ఎన్నిక‌ల ముందు అదికార పార్టీకి షాక్.. !పార్టీ మారుతున్న గులామీ ఎంపీలు..!!

2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర పార్టీలను ఖాళీ చేయగలిగిన కేసీఆర్ ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వచ్చిన తరువాత టీఆరెస్ నేతలను ఒక్కరొక్కరిగా కోల్పోతున్నారు. ఇప్పటికే కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరి అక్కడ టిక్కెట్ తెచ్చుకున్నారు. బాబూమోహన్, బొడిగె శోభ వంటి నేతలు బీజేపీలోకి వెళ్లిపోయారు. పోనీ, వారంతా టిక్కెట్లు రాక వెళ్లిపోయారే అనుకున్నా ఇప్పుడు ఏకంగా న‌లుగురు ఎంపీలు ఖాళీ అవుతారన్న వార్త గులాబీ పార్టీని దడ పుట్టిస్తోంది.

ఓ ప‌క్క కేసీఆర్ ఉద్రుత ప్ర‌చారం..! మ‌రో ప‌క్క పార్టీ మారుత‌న్న ఎంపీలు..!!

ఓ ప‌క్క కేసీఆర్ ఉద్రుత ప్ర‌చారం..! మ‌రో ప‌క్క పార్టీ మారుత‌న్న ఎంపీలు..!!

మరోవైపు ఈ ముంద‌స్తు ఎన్నికల ఫలితాలు అదికార పార్టీకి ఆశాజనకంగా ఉండకపోవచ్చన్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. అదే నిజమైతే వలసలు మరింత తీవ్రమవుతాయని అనుకుంటున్నారు. డిసెంబరు 11న ఫలితాల తరువాత టీఆరెస్‌కు బొటాబొటి సీట్లొస్తే తమ ఎమ్మెల్యేలను ఇత‌ర పార్టీ నాయ‌కులు ఎగరేసుకుపోతారన్న ఆందోళన టీఆరెస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ ఇప్పటికే చాలామంది టీఆరెస్ నేతలతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రేవంత్ సామాజికవర్గానికే చెందిన నేతలు ఆయన నాయకత్వంపై నమ్మకంగా ఉన్నారన్న ప్ర‌చారం కూడా జోరుగా సాగుతోంది.

రేవంత్ గాలానికి చిక్కుతున్న గ‌లాబీ ఎంపీలు..! వ‌రుస‌లో మ‌రో నాలుగురు..??

రేవంత్ గాలానికి చిక్కుతున్న గ‌లాబీ ఎంపీలు..! వ‌రుస‌లో మ‌రో నాలుగురు..??

రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చిన కొద్దికాలానికే ఆ పార్టీలోని అత్యధిక శాతం నేతలు ఆయన వైపు మొగ్గారు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా తమ నియోజకవర్గాల్లో రేవంత్‌తో ప్రచారం చేయిస్తే గెలుపు గ్యారంటీ అని భావిస్తూ ఆయన కోసం పోటీ పడుతున్నారు. టీఆరెస్‌లోని చాలామంది నేతలు ఈ పరిణామాలను గమనిస్తూ రేవంత్‌ను తెలంగాణలో భవిష్యత్ నేతగా భావిస్తూ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా గమనిస్తున్న చంద్ర‌శేఖ‌ర్ రావు సహా టీఆరెస్ కీలక నేతలు ఆందోళ‌నప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

వ‌ల‌స‌ల‌ను అడ్డుకోక పోతే న‌ష్ట‌మే..! న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌పై ద్రుష్టి సారించిన టీఆర్ఎస్..!!

వ‌ల‌స‌ల‌ను అడ్డుకోక పోతే న‌ష్ట‌మే..! న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌పై ద్రుష్టి సారించిన టీఆర్ఎస్..!!

ముందస్తు ఎన్నికలకు వచ్చి ఇప్పటికే తప్పు చేశామని భావిస్తున్న గులాబీ నేత‌ల‌కు మరింత భారీ షాక్ తగలబోతోందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్‌కు రాజకీయంగా అనూహ్యమైన దెబ్బ తగలబోతోందని చెబుతున్నారు. అందుకు రేవంత్ ఇప్పటికే మొత్తం రంగం సిద్ధం చేశారంటున్నారు. ఇద్దరు టీఆరెస్ ఎంపీలు కాంగ్రెస్‌లో చేరుతారని రేవంత్ ఇప్పటికే చెప్పినట్లుగా కాకుండా ఏకంగా అయిదుగురు ఎంపీలు టీఆరెస్‌ను వీడుతారని తెలుస్తోంది. రేవంత్ ఇప్పటికే ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరుతారని చెప్పగా, టీఆరెస్ ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడంతో మ‌రికొంత మంది పార్టీ మారతార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. విశ్వేశ్వరరెడ్డి రెండుమూడు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో విశ్వేశ్వరెడ్డి, సీతారాం నాయక్‌ల పేర్లు బయటకు రాగా మరో మూడు పేర్లూ ప్రచారంలోకొచ్చాయి. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ జితేంద్రరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నిక‌ల వేళ ఇలంటి వ‌ల‌స‌ల వ‌ల్ల జ‌రిగే న‌ష్టానికి అదికార పార్టీ ఎలా అడ్డుక‌ట్ట వేస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+