ఆన్లైన్ డేటింగ్ యాప్.. టెక్కీ ట్రాప్; కాల్ గర్ల్స్ బలహీనతకు భారీ మూల్యం!!

ఆన్లైన్ డేటింగ్ యాప్ లో కాల్ గర్ల్ కోసం వెతికిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి అడ్డంగా బుక్కయ్యాడు. అమ్మాయిల బలహీనత అతడి జేబు గుల్ల చేసింది. మాయమాటలకు మోసపోయి దాదాపు రెండు లక్షల వరకు సొమ్ము పోగొట్టుకున్నాడు. తీరా మోసపోయానని గ్రహించిన తరువాత పోలీసుల దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసి లబోదిబో మన్నాడు. బలహీనతకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

కాల్ గర్ల్స్ కోసం ఆన్లైన్ డేటింగ్ యాప్.. టెక్కీ ట్రాప్

కాల్ గర్ల్స్ కోసం ఆన్లైన్ డేటింగ్ యాప్.. టెక్కీ ట్రాప్


హైదరాబాదులోని చందానగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన విషయానికి వస్తే ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి డిసెంబర్ చివరి వారంలో ఆన్లైన్లో డేటింగ్ కోసం వెతికి ఒక వెబ్ సైట్ కనిపించడంతో ఆ లింక్ పై క్లిక్ చేశాడు. అందులో అతనికి ఒక వాట్సాప్ నెంబర్ కనిపించడంతో ఆ వాట్సాప్ నెంబర్ కి చాటింగ్ మొదలు పెట్టాడు. అవతల నుంచి ఒక వ్యక్తి తనను పటేల్ ఛార్మి పేరుతో పరిచయం చేసుకున్నారు. తన వద్ద ఎంతోమంది కాల్ గర్ల్స్ ఉన్నారని, తక్కువ ధరకే వారు సర్వీసులు అందిస్తామని నమ్మించాడు.

సైబర్ వలలో టెక్కీ .. అమ్మాయి కోసం అడిగిన డబ్బులు పంపిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి

సైబర్ వలలో టెక్కీ .. అమ్మాయి కోసం అడిగిన డబ్బులు పంపిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి

ఇక అందంగా ఉన్న కొందరు అమ్మాయిల ఫోటోలు కూడా పంపించి ట్రాప్ చేశాడు. ఇక సదరు వ్యక్తి పంపించిన అమ్మాయిల ఫోటోలను చూసి బాగా టెంప్ట్ అయిన సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగి అవతలి వ్యక్తి ఏం చెప్తే అది చేశాడు. మొదట్లో బుకింగ్ కోసం 510 రూపాయలు, ఆ తర్వాత ఒక రాత్రికి అమ్మాయి కావాలంటే ఐదు వేల ఐదు వందలు రూపాయలు, ఆపై సెక్యూరిటీ డిపాజిట్ కింద 7800 రూపాయలు కట్టాలని కోరాడు. ఇక ఆ డబ్బును కూడా చెల్లించిన టెక్కీ అతని వలలో పడ్డాడు.

2 లక్షల వరకు మోసం.. పోలీసులకు ఫిర్యాదు

2 లక్షల వరకు మోసం.. పోలీసులకు ఫిర్యాదు


ఆ తర్వాత వరుసగా వేరువేరు కారణాలు చెబుతూ సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వద్దనుండి సైబర్ నేరగాడు ఏకంగా లక్షా 97 వేల రూపాయలు కాజేశాడు. ఆపై నెంబర్ కూడా బ్లాక్ చేసి పత్తా లేకుండా పోయాడు. ఇక ఫోన్ చేస్తే కూడా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గుర్తించిన సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆన్లైన్లో కనిపించినటువంటి సైట్లను నమ్మవద్దని, మోసపోవద్దని సూచిస్తున్నారు. ఇటువంటి స్కాం ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+