శుభవార్త.. ప్రైవేటు స్కూల్స్ లో పేదలకు 25 శాతం సీట్లకు ముందడుగు!

తెలంగాణలోని తల్లిదండ్రులకు శుభవార్త. నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలన్న విద్యాహక్కు చట్టం నిబంధన ఇప్పుడు నిజం అయ్యే అవకాశం కన్పిస్తోంది. దశాబ్దాలుగా చాలా రాష్ట్రాల్లో ఈ నిబంధన కేవలం కాగితాలకే పరిమితం కాగా, సుప్రీంకోర్టు ఇటీవల తీసుకున్న కఠిన నిర్ణయం తెలంగాణలోనూ కదలిక తెచ్చింది.

విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1)(సి) ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా ఇవ్వాలి. ఈ నిబంధనను అమలు చేయాలని ఈ ఏడాది జనవరిలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని, దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలని, లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయించాలని పేర్కొంది. సమస్యలు పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

free seats in private schools Telangana focus on 25 Free Seats in Private Schools with SupremeCourt Push

ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించే బాధ్యతను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం కు అప్పగించింది. అయితే చాలా రాష్ట్రాలు ఇప్పటికీ సక్రమంగా అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్‌సీపీసీఆర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 27న జరిగే విచారణకు సంఘం అధికారులు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఎన్‌సీపీసీఆర్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరగా, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఢిల్లీ వెళ్లి సుప్రీం మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఇంతకు ముందు కూడా ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2025 జూలైలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని 96 ఆవాసాల్లోని పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

కానీ అవి కేవలం డిఈఓలకు పంపడంతోనే ఆగిపోయాయి. ఫలితంగా 2025-26, 2026-27 విద్యా సంవత్సరాల్లో కేవలం 180 మంది పిల్లలు మాత్రమే ఈ కేటాయింపు ద్వారా ప్రవేశం పొందగలిగారు. ఇప్పుడు సుప్రీం కోర్టు దృష్టి సారించిన తర్వాత అధికారులు మళ్లీ ఫోకస్ చేస్తున్నారు. యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే విధి విధానాలు రూపొందించుకొని అమలు చేస్తున్నాయి.

తెలంగాణలోనూ ఇలాంటి స్పష్టమైన వ్యవస్థ ఏర్పాటు అయితే లక్షల మంది పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు పాఠశాలల్లో ఇలా సీట్లు కేటాయించడం వల్ల పేద, ధనిక పిల్లల మధ్య ఉన్న అంతరం తగ్గుతుందని, సామాజిక సమానత్వం పెరుగుతుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అమలులో సవాళ్లు కూడా ఉన్నాయి. చాలా ప్రైవేటు పాఠశాలలు ఈ నిబంధనను అమలు చేయడానికి ఇష్టపడవు.

దసరా డిమాండ్.. చికెన్ ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!
దసరా డిమాండ్.. చికెన్ ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో రాకపోవడం, సీట్ల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలు గతంలోనూ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన గైడ్‌లైన్స్ రూపొందించి, ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి, లాటరీ విధానంతో సీట్లు కేటాయించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది. ఆ దిశగా [ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+