కెసిఆర్‌కు రిలీఫ్!: ఉద్యమ పాటనే.. వరంగల్ ఉపఎన్నికపై షాకిచ్చిన గద్దర్

వరంగల్: వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజాయుద్ధ నౌక గద్దర్ పోటీ పైన చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది! ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని గద్దర్ స్వయంగా ఇప్పటి వరకు చెప్పనప్పటికీ... గద్దర్ అంగీకరించారని ఇటీవల వామపక్ష నేతలు చెప్పారు.

వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్‌ను బరిలోకి దింపుతామని చెప్పారు. దీంతో, గద్దర్ తప్పకుండా వరంగల్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతారని ఇప్పటి వరకు అందరూ భావించారు. అయితే, ఆయన సోమవారం తన పోటీ విషయమై స్పందించారు.

వరంగల్ ఉప ఎన్నికలో తాను పోటీ చేసే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దాదాపు, పోటీ చేసే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యల్లో కనిపించింది. ప్రస్తుతానికి ఉద్యమ పాటగానే తాను ఉంటానని చెప్పారు.

Gaddar says no to contest in Warangal Lok Sabha by polls

ఎన్నికల్లో పోటీపై సిద్ధాంతపరమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. గద్దర్‌ను దళిత సంఘాల నేతలు సోమవారం కలిశారు. వారితో మాట్లాడిన అనంతరం గద్దర్ పైవిధంగా స్పందించారు. కాగా, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామాతో వరంగల్ లోకసభకు ఉప ఎన్నిక జరగనుంది.

కాగా, గద్దర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే తుపాకీ రాజ్యమా లేక బ్యాలెట్ రాజ్యమా స్పష్టత ఇవ్వాలని టిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే, ఇప్పుడు పోటీ చేయనని చెప్పడం.. ఒకవిధంగా టీఆర్ఎస్‌కు ఊరటేనని చెప్పవచ్చు. గద్దర్ పోటీలో ఉంటే, కాంగ్రెస్ - టిడిపిలు మద్దతు ప్రకటిస్తాయా, ప్రకటిస్తే అది టిఆర్ఎస్‌కు చిక్కులే అనే చర్చ సాగింది.

అటవీశాఖ అధికారులతో మంత్రి జోగు రామన్న భేటీ

హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో అటవీ శాఖ అధికారులతో మంత్రి జోగు రామన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎకో టూరిజంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. హరితహారంలో ఉద్యమంలా మొక్కలు నాటాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+