కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్యలో అదానీ.. మాటల యుద్ధం!
తెలంగాణ రాష్ట్రంలో అదానీ వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది . ఇటీవల అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపైన లంచం మరియు మోసం ఆరోపణలతో యుఎస్ లో కేసు నమోదు కాగా తెలుగు రాష్ట్రాలలో అది సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక అదాని వ్యవహారం పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయాలని కాంగ్రెస్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది.
అదానీ వ్యవహారంలో రేవంత్ ప్రకటన టార్గెట్ చేసిన కేటీఆర్
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అదానితో రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలను బిఆర్ఎస్ పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. దీంతో తాజాగా రేవంత్ రెడ్డి అదాని తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ ఇండియా యూనివర్సిటీ కోసం ఇస్తానని చెప్పిన 100 కోట్ల రూపాయల విరాళాన్ని తిరస్కరిస్తున్నామని సంచలన ప్రకటన చేశారు. ఇక దీంతో రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసిన కేటీఆర్ తనదైన విమర్శలు గుప్పించారు.

కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదు అసలు సంగతేంటి?
రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వలన సీఎం రేవంత్ ఆదాని ఇచ్చిన 100 కోట్లు తిరస్కరించాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు . నేడు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదు అసలు సంగతేంటి అంటూ ప్రశ్నించారు. 12,400కోట్ల ఒప్పందాల సంగతి ఏమిటో చెప్పాలని నిలదీశారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి లలో ఎవరు పిచ్చోళ్ళు వాళ్ళే తేల్చుకోవాలంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి చెప్పే అబద్దాలను చూస్తే ఇకపై అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అని పిలవాలని ఎద్దేవా చేశారు. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్టును అదానీ డేటా సెంటర్ అని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి కంటే చిన్నవాడిని కాబట్టి తాను తిడితే పడతానని కానీ కెసిఆర్ ను అనడానికి రేవంత్ రెడ్డికి ఎంత ధైర్యం అంటూ ప్రశ్నించారు.
రేవంత్ లాగా అదానీ కాళ్ళు పట్టుకోలేదు
చిట్టి నాయుడికి చిప్ పనిచేయడం లేదని నిన్నటి కామెంట్స్ తో అర్థమవుతుందన్నారు. ఈడి కేసు కోసం రేవంత్ అతని మంత్రుల లెక్క మేము అదాని కాళ్లు పట్టుకోలేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ కోహినూర్లో అదాని కాళ్లు పట్టుకున్నట్టు తామేనాడూ చేయలేదన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డికి కేసీఆర్ మీద తన మీద ఇంకా ఫ్రస్టేషన్ దేనికని ప్రశ్నించారు.
బ్యాగులు మోసిన గజదొంగ
28 సార్లు ఢిల్లీ వెళ్ళిన రేవంత్ రెడ్డి కనీసం 28 రూపాయలు కూడా తీసుకు రాలేదని ఎద్దేవా చేశారు. బ్యాగులు మోసిన గజదొంగ రేవంత్ రెడ్డి అని తిట్టిపోసిన కేటీఆర్ అదానికి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేస్తున్నాడు అన్నారు. తాము ఆదానీకి రెడ్ సిగ్నల్ చూపించామని పేర్కొన్నారు.
-
తెలంగాణ బడ్జెట్ లో కొత్త పథకాలు, శాఖల వారీ కేటాయింపులు..!! -
ప్రతీ కుటుంబానికి రూ 5 లక్షలు ఉచితంగా, బడ్జెట్ లో భట్టి ప్రకటన - అమలు ఇలా..!! -
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
బడ్జెట్ లో కొత్త పథకాలు: వీరికి భారీగా లబ్ది - అమలు ముహూర్తం..!! -
భట్టి బడ్జెట్ తో ఉద్యోగులకు దక్కిందేంటి..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications