వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం.. అందుకే గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక చిత్రమని ప్రచారం: చిరంజీవి

బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని తారాగణంగా, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక చిత్రంగా పేర్కొనడం సరికాదని హైదరాబాద్ డెక్కన్ డెమోక్రటిక్ అలెయన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని తారాగణంగా, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక చిత్రంగా పేర్కొనడం సరికాదని హైదరాబాద్ డెక్కన్ డెమోక్రటిక్ అలెయన్స్ అధ్యక్షులు కల్లూరి చిరంజీవి, వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు లింగాల పాండు రంగా రెడ్డిలు అన్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి - కొత్త కోణం: 'అసలు'పై చర్చ

చారిత్రక సినిమా పేరుతో వినోదపు పన్ను మినహాయింపు పొందడం దారుణం అన్నారు. ఈ చిత్రం టైటిలే తప్పుగా ఉందన్నారు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఆంధ్ర ప్రశస్తి పద్యరూపకంలో గౌతమీపుత్ర శాతకర్ణిని వర్ణించారన్నారు.

'Gautamiputra Satakarni is not historical film'

తెలంగాణ ప్రభుత్వం వద్ద రాయితీలు పొందేందుకు గౌతమీపుత్ర శాతకర్ణి కోటిలింగాలలో జన్మించినట్లుగా చూపించడం సరికాదన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలపై అతని తల్లి బాలాశ్రీ వేయించిన నాసిక్ శిలాశాసనంలోను ఆయన అమరావతి కేంద్రంగా భారత్‌ను పాలించినట్లు లేదన్నారు.

పన్ను మినహాయింపు వేస్ట్: గౌతమీపుత్ర శాతకర్ణిపై సీఎంలకు వరుస షాక్‌లు

పశ్చిమ దక్షిణ భారతదేశాన్ని మాత్రమే ఆయన పాలించారని వారు తెలిపారు. విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఆంధ్ర ప్రశస్తి పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించామని చెప్పడం అవాస్తవమన్నారు. ఈ సినిమా కల్పితమని, రాయితీల కోసం చారిత్రక చిత్రమని ప్రచారం చేశారన్నారు. గ్రీక్, ఇంగ్లీష్ చిత్రాలను కాపీ కొట్టారన్నారు.

English summary
Hyderabad Deccan Alliance alleged that Gautamiputra Satakarni is not historical film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X