జీహెచ్‌ఎంసీ లో కొత్తగా 6 జోన్లు.. డివిజన్ల సంఖ్య 300కు పెంపు..
జీహెచ్ ఎంసీ డీలిమిటేషన్ కు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదల అయింది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు అలాగే 30 సర్కిళ్లను 60 కు అలాగే డివిజన్లను 300 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ లను కొత్త జోన్లుగా పేర్కొంది. డివిజన్ల డీలిమిటేషన్ కు సంబంధించి 10 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరణ అనంతరం జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ తుది నోటిఫికేషన్ ను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
జీహెచ్ ఎంసీ పరిపాలనా వ్యవస్థను మరింత విస్తరించి బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగరం క్రమక్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచింది. ఈ మేరకు జీహెచ్ ఎంసీ డీలిమిటేషన్ కు సంబంధించి తుది నోటిఫికేషన్ ను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్తగా 6 జోన్లను ఏర్పాటు చేసింది. అవి ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్ గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్.. కాగా సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. త్వరలో ఈ కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల నుంచే పరిపాలన ప్రారంభం కానుంది.

డివిజన్ల డీలిమిటేషన్ కు సంబంధించి ఈనెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 10 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించారు. అలా ప్రజలు, ప్రతినిధుల నుంచి 6 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో సహేతుకమైన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ ను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications