ఆస్తి పన్ను కట్టండి.. 90 శాతం వడ్డీ రాయితీ పొందండి!

ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి జీహెచ్ఎంసీ అదిరిపోయే వార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ మొత్తాన్ని ఈ నెల 31 లోపు చెల్లిస్తే, దానిపై అదనంగా పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంటే మీరు కేవలం అసలు పన్నుతో పాటు, కేవలం 10 శాతం వడ్డీని చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి పన్ను వసూళ్లను వేగవంతం చేయడంతో పాటు, పౌరులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

GHMC Property Tax Rebate 2026 90 Percentage Interest Waiver on Pending Dues If Paid Before March 31

ప్రజలు తమ సౌకర్యార్థం కింది మార్గాల ద్వారా పన్ను చెల్లించుకోవచ్చని అధికారులు సూచించారు:

  • ఆన్‌లైన్ ద్వారా: అధికారిక వెబ్‌సైట్ www.ghmc.gov.in సందర్శించి సులభంగా చెల్లించవచ్చు.
  • యాప్ ద్వారా: మీ ఫోన్‌లోని 'MY GHMC' యాప్ ద్వారా క్షణాల్లో లావాదేవీ పూర్తి చేయవచ్చు.
  • నేరుగా: మీసేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లు (CSC) లేదా జీహెచ్ఎంసీ రింగ్ కౌంటర్ల వద్ద నగదు/కార్డు ద్వారా చెల్లించవచ్చు.

నగరాభివృద్ధిలో భాగస్వాములు కండి!

"ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సకాలంలో పన్ను చెల్లించాలి. మీరు చెల్లించే పన్ను నగరంలోని మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల అభివృద్ధి మరియు పారిశుధ్య పనులకు ఉపయోగపడుతుంది. వడ్డీ రాయితీ పొంది నగరాభివృద్ధికి సహకరించండి" అని కమిషనర్ పిలుపునిచ్చారు.

గుర్తుంచుకోండి, ఈ 90% రాయితీ సదుపాయం కేవలం మార్చి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ పూర్తి వడ్డీ చెల్లించాల్సి రావచ్చు, కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ బకాయిలను క్లియర్ చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+