అక్కడ వ్యభిచారం, విస్తుపోయే వాస్తవాలు: ఎక్కడెక్కడికో లింక్‌లు, ఆ అమ్మాయిలే టార్గెట్

భువనగిరి: పవిత్ర పుణ్యక్షేత్రం సమీపంలో కొందరు దుర్మార్గులు దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ సెక్స్ రాకెట్ వెలుగు చూసింది. ఇటీవల పోలీసులు పలువురు యువతులను రక్షించారు. పోలీసులు పలుమార్లు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి అమ్మాయిలను కాపాడారు. ఈ దాడుల్లో షాకింగ్ విషయాలు గుర్తించారు. పోలీసులు దాడులు చేసినప్పుడు భద్రంగా ఉండేందుకు వ్యభిచారం నిర్వహించే గదుల్లో, మంచాల కింద సొరంగాలు గుర్తించారు.

నాలుగు రోజుల క్రితం తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో నలుగురు బాలికలను పోలీసులు ఈ కూపం నుంచి కాపాడారు. ఇదే ఇంటిలో రెండు రోజుల క్రితం కూడా తనిఖీలు చేసిన సమయంలో ఎవరూ కనిపించలేదు. కానీ ఆ తర్వాత నాలుగు రోజులకు ఇంట్లో అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి గదిని పరిశీలించారు. గదిలోని మంచం కింద గోడను తొలుస్తూ మూడు అడుగుల వెడల్పుతో ఉన్న సొరంగంలో బాలికలను దాచారని గుర్తించి ఆశ్చర్యపోయారు పోలీసులు.

యాదగిరిగుట్ట నుంచి ఎక్కడెక్కడికో లింకులు

యాదగిరిగుట్ట నుంచి ఎక్కడెక్కడికో లింకులు

పోలీసులు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం తెలిస్తే వారిని ఆ సొరంగంలోకి పంపిస్తారని, అందులో ఆరుగురి వరకు పట్టే వీలుంటుందని చెబుతున్నారు. బయటకు ఏమాత్రం అనుమానం రాని విధంగా ఉంటుంది. దానికి మంచం అడ్డు పెట్టారు. కాగా, ఈ సెక్స్ రాకెట్ సిద్దిపేట, కొడకండ్ల, రామచంద్రాపురం తదితర ప్రాంతాలకు విస్తరించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్దిపేటలోని కోమటిచెరువు సమీపంలో దశాబ్దాలుగా వ్యవభిచార గృహాలు నడుస్తున్నాయని అంటున్నారు. యాదగిరిగుట్ట, చిలకలూరిపేట, పెద్దాపురం తదితర ప్రాంతాలకు లింకులు ఉన్నాయని, ఇక్కడి అమ్మాయిలను అక్కడకు, అక్కడి అమ్మాయిలను ఇక్కడకు మార్చి తెస్తుంటారని గుర్తించారని తెలుస్తోంది. పోలీసు బృందాలు వ్యభిచార గృహాలపై నిఘా పెంచాయి.

ఈ యువతులే టార్గెట్

ఈ యువతులే టార్గెట్

యాదగిరిగుట్టకు కొందరు చిన్నారులు, మహిళలను తీసుకువచ్చి వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. నెల రోజుల నుంచి మూడు నెలల వరకు ఒప్పందాలపై తీసుకు వెళ్తూ గడువు ముగిసిన తర్వాత దళారులు, ముఠాలు ఇతర ప్రాంతాలకు ఆ అమ్మాయిలను తరలిస్తున్నారు. ఇటీవల పోలీసులు గుర్తించిన చిన్నారులను డీఎన్ఏ పరీక్ష నిర్వహించి వారి తల్లిదండ్రులకు అఫ్పగించనున్నారు. ఒంటరి మహిళలు, ప్రేమ, ఉద్యోగాలు, సినిమాల మోజులోపడి మోసపోయిన యువతులు, ఇంట్లో పెద్దలపై అలిగి వచ్చిన చిన్నారులు, యువతులకు ఆశ చూపి తీసుకు వస్తారు.

హార్మోన్ ఇంజక్షన్‌తో పెద్దవారిగా మార్చి

హార్మోన్ ఇంజక్షన్‌తో పెద్దవారిగా మార్చి

చిన్నారులను అపహరించి, హార్మోన్ ఇంజక్షన్‌తో వారిని త్వరగా పెద్దవారిగా మార్చి వ్యభిచారంలోకి దింపుతున్నారు. యాదగిరిగుట్ట నుంచి అదిలాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్ వరకు, ఇతర రాష్ట్రాలని పలు ప్రాంతాలకు వ్యభిచార రవాణా ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది. గతంలో ఇక్కడ ఓ వర్గం ఈ వృత్తిలోనే ఉండేది. వారి కూతుళ్లను కూడా ఈ వృత్తిలోకి దింపేవారు. ఇప్పుడు వారు ఇతరులను తీసుకువచ్చి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు.

వ్యభిచారవృత్తి

వ్యభిచారవృత్తి

ఇక్కడ వ్యభిచార వృత్తిలోని మహిళలకు ఆడపిల్ల పుడితే తల్లిని చూపించి అదే వృత్తిలోకి కూతుళ్లను దింపుతున్నారు. మగవారు అయితే విటులను తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నారు. పిల్లలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ఈ రొంపిలోకి దింపే ప్రయత్నాలు చేస్తారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+