వెనక్కు తగ్గొద్దు: బండి సంజయ్‌కు అమిత్ షా డైరెక్షన్

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే నిన్న రాత్రి హనుమకొండ కోర్టు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేయడంతో నేడు కరీంనగర్ జైలు నుండి బండి సంజయ్ బయటకు వచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బండి సంజయ్ తనదైన శైలిలో కెసిఆర్ ను టార్గెట్ చేశారు.

హిందీ ప్రశ్నాపత్రాన్ని ఎవరైనా లీక్ చేస్తారా అంటూ మండిపడిన బండి సంజయ్ త్వరలోనే కేటీఆర్, కవిత జైలుకు వెళతారు అంటూ బండి సంజయ్ మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో కరీంనగర్ జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ కు బిజెపి జాతీయ నేతలు వరుసగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. బండి సంజయ్ తో మాట్లాడుతూ వారు, తెలంగాణ బిజెపికి అండగా ఉంటామని చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితి అయినా ధైర్యంగా ఎదుర్కోవాలని,తామంతా బండి సంజయ్ కు, తెలంగాణా బీజేపీకి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.

 bandisanjayamithshah

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, తరుణ్ చుగ్, సునీల్ బన్సన్ బండి సంజయ్ కి ఫోన్ చేసి భరోసా ఇచ్చారు. కేంద్రం, బిజెపి నాయకత్వం తమకు అండగా ఉంటుందని వారంతా బండి సంజయ్ కు చెప్పారు. బిజెపి పై పోరాటాన్ని ఆపొద్దని సూచించారు. బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలని వారు బండి సంజయ్ కు సూచించారు. జరిగిన పరిణామాల గురించి ఆరా తీసి, మరింత గట్టిగా రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ పై పోరాటం చేయాలని చెప్పారు.

బండి సంజయ్ "తుమ్ ఆగే బడో" అంటూ తమదైన శైలిలో బండి సంజయ్ కు దిశా నిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని వారు ఈ సందర్భంగా బండి సంజయ్ కు తెలియజేశారు. ఇదే కసితో ముందుకు నడవాలన్నారు. ఇదిలా ఉంటే కరీంనగర్ కు బిజెపి ఇన్చార్జి తరుణ్ చుగ్ తో పాటు బిజెపి ముఖ్య నేతలు బయలుదేరారు. వీరు బండి సంజయ్ ను హైదరాబాద్ కు తీసుకురానున్నారు. నేడు రాత్రి బిజెపి కార్యాలయంలో కార్యకర్తలు బండి సంజయ్ కు ఘనస్వాగతం పలకనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+