హైదరాబాద్ TO గోవా, ఉడిపి, మురుడేశ్వర్.. ఆర్టీసీ బస్సులో.. తక్కువ ధరకే..
భారత్ లో ఫేమస్ టూరిస్ట్ ప్రాంతం ఏది అనగానే టక్కున గుర్తొచ్చే పేరు గోవా.. ఫ్రెండ్స్ నలుగురు కలిస్తే చాలు గోవా వెళ్దామా అని అంటుంటారు. ఇక వేసవిలో అయితే ఒక్కసారైనా గోవా బీచ్ లో ఎంజాయ్ చేయాలని యువత కోరుకుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టైమ్ స్పెండింగ్ చేయడమే కాకుండా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిస్టినేషన్ వెడ్డింగ్స్ వరకూ గోవాకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక గోవా ప్రాంతం పర్యటకుల తాకిడితో నిత్యం కోలాహలంగా ఉంటుంది. ఇక వీకెండ్స్, సెలవుల్లో అయితే ఈ ప్రాంతం పర్యటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.
అయితే ఇప్పుడు తక్కువ ధరకే హైదరాబాద్ టూ గోవా టూర్ వెళ్లే సదుపాయాన్ని కల్పిస్తోంది టీజీఎస్ఆర్టీసీ. కేవలం గోవా మాత్రమే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ఉడుపి, మురుడేశ్వర్ లను కూడా కవర్ చేస్తోంది. ఉడుపిలో శ్రీ కృష్ణ మఠం ఉంది. ఇక్కడ శ్రీ కృష్ణుడిని నేరుగా కాకుండా 'కనకన కిండి' అనే 9 రంధ్రాల కిటికీ ద్వారా దర్శించుకోవడం ప్రత్యేకతగా చెబుతారు. అలాగే ఉడుపిలో మల్పే బీచ్, మేరీస్ ఐలాండ్, కాపు బీచ్ లు కూడా చూడదగ్గ ప్రదేశాలు.
ఇక మురుడేశ్వర్ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ఆలయంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం అరేబియన్ సముద్రతీరాన ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద శివుని విగ్రహం ఉంది. శివుని విగ్రహం దాదాపు 123 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక ఈ ఆలయంలోని రాజగోపురం ఎత్తు దాదాపు 237.5 అడుగులు ఉంటుంది. ఈ ఆలయ గోపురం 20 అంతస్తుల మేర నిర్మించారు. అలా ప్రపంచంలోనే ఎత్తైన గోపురాల్లో ఒకటిగా మురుడేశ్వర్ ఆలయం ప్రసిద్దిగాంచింది.
ఇక టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 25 న బస్సు హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. మొదట కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయానికి బస్సు చేరుకుంటుంది. ఆ తర్వాత ఉడిపి, మురుడేశ్వర్ మీదుగా గోవాకు చేరుకుంటుంది. రెండు రోజుల పాటు గోవా టూర్ ఉంటుంది. అలా గోవా టూర్ నుంచి నేరుగా హైదరాబాద్ బస్సు చేరుకుంటుంది.

ఇక ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధర రూ. 5,130 గా అధికారులు నిర్ణయించారు. ఇక ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ను సంప్రదించాలని పేర్కొంది. అలాగే ఇతర వివరాల కోసం 9391072283, 9063401072 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని అధికారులు తెలిపారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications