హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొలంలో లభించిన బంగారు లంకె బిందె: హోంగార్డు ఎంట్రీ ఇచ్చి పంచేశాడు! కానీ..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సూర్యపేట జిల్లాలో లంకెబిందెలు దొరకడం స్థానికంగా కలకలం రేపింది. చివ్వెంల మండలం తుల్జారావుపేట గ్రామంలోని ఓ వ్యవసాయ భూమిలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా లంకెబిందెలు లభించినట్లుగా తెలిసింది. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తుల్జారావుపేట గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆ భూమిలో ఇటీవల ట్రాక్టర్‌తో దున్నుతుండగా.. ట్రాక్టర్ నాగళ్లకు లంకె బిందెలు తగిలాయి. ఓ బిందెలో కిలోకుపైగా బంగారం ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో ట్రాక్టర్ దున్నే వ్యక్తితోపాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు ఉన్నారు.

Gold pots found in a field in suryapet district.

ఈ క్రమంలో బంగారం పంపకాలలో వివాదం తలెత్తింది. ఈ సమస్య ఓ హోంగార్డు వద్దకు చేరింది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సదరు హోంగార్డు ఈ సమస్యను పరిష్కరించాడు. అతను మధ్యవర్తిత్వం వహించి పంపకాలు జరిపాడు.

ముగ్గురిలో ఇద్దరికి రూ. 10 లక్షలు, మరొకరికి రూ. 14 లక్షలు ఇచ్చి మిగితా బంగారం మరో వ్యక్తి సదరు హోంగార్డు అమ్ముకునేలా నిర్ణయించకున్నారని గ్రామస్తులు ద్వారా తెలిసింది. అయితే, ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిసింది.

హైదరాబాద్ పాతబస్తీలో అర్దారాత్రి యువలకు బీభత్సం

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు.
పాతబస్తీలో అర్ధరాత్రి ఇంటి ముందు కూర్చొని ఎందుకు లొల్లి చేస్తున్నారని ప్రశ్నించినందుకు.. ఓ 20 మంది గ్యాంగ్ కలిసి ఓ కుటుంబంపై దాడికి పాల్పడిన ఘటన పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి చోటుచేసుకుంది

వివరాల్లోకి వెళితే.. బార్కాస్ ప్రాంతానికి చెందిన సల్మాన్ ఇంటి ముందు అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్న పొరుగు ఇళ్లకు చెందిన సయ్యద్ తారీఖ్ అతని బంధువులను సల్మాన్ వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో రెచ్చిపోయిన వారు వెళ్లపొమ్మనడానికి నువ్వెవ్వరంటూ దూషించారు. అంతేగాక, కొద్ది సేపటి అనంతరం జిలానీ అండ్ గ్యాంగ్... కత్తులు, కర్రలతో దాడికి పాల్పడి హత్య చేసేందుకు యత్నించారు.

Recommended Video

Journalist Raghu Press Meet జర్నలిజాన్ని తొక్కేసే కుట్ర జరుగుతుంది.. భయపడను

ఈ ఘటనలో అద్నాన్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. రెండు గ్రూపులు ఫిర్యాదు చేయడంతో 16 మందిపైన కేసులు నమోదు చేశారు. కాగా 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో దాని ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

English summary
Gold pots found in a field in suryapet district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X