మామూలు షాక్ కాదు: రైలు దిగాక గానీ ఆమె గుర్తించలేదు..
వెంటనే చోరీ ఘటనపై సికింద్రాబాదు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరు రాణి అని తాను హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటానని తెలిపింది.
హైదరాబాద్: రైళ్లలో విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లేప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఓ మహిళకు చెందిన రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు.
గురువారం ఉదయం రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ చేరుకున్న ఆ మహిళ.. స్టేషన్ లో దిగిన తర్వాత గానీ నగలు పోయిన విషయాన్ని గుర్తించలేదు. ఆ వెంటనే చోరీ ఘటనపై సికింద్రాబాదు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరు రాణి అని తాను హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటానని తెలిపింది.

నగలతో పాటు రూ.5 లక్షలు కూడా చోరీకి గురయ్యాయని పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications