Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త.. మోదీ చేతులమీదుగా తెలంగాణలో మూడు రైల్వేస్టేషన్లు ప్రారంభం.. విశేషాలివే

కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే, ఇదే క్రమంలో తెలంగాణా రాష్ట్రంలోనూ రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేస్తుంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 22న తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం కానున్నాయి.

తెలంగాణా మూడు రైల్వే స్టేషన్ల పునః ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
దేశ వ్యాప్తంగా మొత్తం 102 స్టేషన్లు పునః ప్రారంభం కానుండగా, అందులో మూడు తెలంగాణా రాష్ట్ర రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇక ప్రధాని చేతుల మీదుగా పునః ప్రారంభం కానున్న రైల్వే స్టేషన్ల వివరాలలోకి వెళితే

Good news to telangana people Modi inaugurates three railway stations in Telangana on may 22nd virtually these are the specialities of the renewed begumpet karimnagar and warangal railway stations

26.55 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునికంగా బేగంపేట రైల్వే స్టేషన్
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పునరాభివృద్ధి చేశారు. 26.55 కోట్ల రూపాయల వ్యయంతో పునరాభివృద్ధి చేశారు. కొత్త స్టేషన్ భవనం,12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్లాట్‌ఫామ్ షెల్టర్, లిఫ్ట్‌లు/ఎస్కలేటర్లు, కొత్త వెయిటింగ్ హాల్, కొత్త టాయిలెట్లు ఇలా ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులను కల్పించారు.

ఎయిర్పోర్ట్ తరహాలో సర్వాంగ సుందరంగా వరంగల్ రైల్వే స్టేషన్
అత్యాధునిక వసతులతో బేగంపేట రైల్వే స్టేషన్ ను ఒక ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధి చేశారు. ఇదే సమయంలో 25.41 కోట్ల నిధులచే అధునాతన వరంగల్ రైల్వే స్టేషన్ భవనం పునః ప్రారంభానికి సిద్ధమైంది. ఎయిర్పోర్ట్ తరహాలో అత్యాధునిక వసతులతో వరంగల్ రైల్వే స్టేషన్ లో విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు , లిఫ్టులు, ర్యాంపులు, ల్యాండ్ స్కేపింగ్, ఆధునిక ఆహారశాలలు, వాణిజ్య సముదాయాలు నిర్మించారు.

పునః ప్రారంభానికి రెడీ అయిన కరీంనగర్ రైల్వే స్టేషన్
అదేవిధంగా మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ కార్పోరేట్ తరహాలో ఏసీ వెయిటింగ్ హాల్స్ నిర్మించారు. రైల్వే స్టేషన్ మొత్తం సీసీటీవీ పరిధిలో ఉంచడంతోపాటు పచ్చదనం, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నెల 22 తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్ పద్దతిలో ఆదునీకరించిన కరీంనగర్ రైల్వేస్టేషన్ ను ప్రారంబించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ క్రింద 2023 ఆగష్టు లో పీఎం నరేంద్ర మోదీ ప్రారంభించారు.

30 కోట్ల రూపాయలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి
అప్పటి నుండి ఇప్పటివరకు వివిధ రకాల అభివృద్ధి పనులు జరిగాయి. 30 కోట్ల రూపాయలతో స్టేషన్ అభివృద్ధి లో భాగంగా అప్రోచ్ రోడ్,6 బుకింగ్ కౌంటింగ్ సెంటర్,వికాలంగులకు ప్రత్యేక బుకింగ్ కౌంటర్, 12 మీటర్ వెడల్పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి, రెండు ఎస్కలేటర్లు, స్టేషన్ ముందు పార్క్, వెయిటింగ్ హల్, అన్ని రకాల సైన్ గుర్తులు ఏర్పాటు చేసారు. తెలంగాణ లోని మూడు రైల్వేస్టేషన్ లు 22 న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇంకా 37 స్టేషన్ లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+