మహిళలకు శుభవార్త.. మీ కోసమే మరో 40 పెట్రోల్ బంకులు!
తెలంగాణా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది. కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా 'ఇందిరా మహిళా శక్తి పథకం' కింద ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ లను, ఆర్టీసీ బస్సులను అందిస్తున్న సర్కార్ మహిళల కోసం పెట్రోల్ బంకులను కూడా అందిస్తుంది. ఇప్పటికే సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లోని రెండు పెట్రోల్ బంకులు లాభాలతో విజయవంతమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా మరో 40 మహిళా పెట్రోల్ బంకులు
ఈ పెట్రోల్ బంకుల నిర్వహణలో సిబ్బంది, మేనేజర్లు, ఆపరేటర్లు, యజమానులందరూ మహిళలే. ఈ విజయం ఇచ్చిన స్పూర్తితో రాష్ట్రవ్యాప్తంగా మరో 40 మహిళా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థలాల ఎంపిక పూర్తికాగా, నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది.

జూన్ 2న 20 బంకులు పూర్తి చేసి ప్రారంభించే లక్ష్యం
గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ప్రణాళికల ప్రకారం, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి 20 బంకులు పూర్తి చేసి ప్రారంభించే లక్ష్యంతో ఉంది. ఈ దిశగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్త బంకుల పనులు ఆదిలాబాద్ కైలాష్‌నగర్ లో , నల్గొండ గండవారిగూడెంలో , కుమురం భీమ్ ఆసిఫాబాద్లో , పెద్దపల్లి లోని భూపతిపురంలో , వికారాబాద్ హకీంపేట్ దుడ్యాల్ లలో మొదలయ్యాయి.
ఇక్కడ కూడా కొత్త పెట్రోల్ బంకులు
కరీంనగర్, మెదక్, ములుగు, సిరిసిల్ల కేంద్రాల్లోనూ మరిన్ని బంకులు రానున్నాయి. ఇక పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయటం కోసం పలు జిల్లాలలో భూసేకరణ చేసి మహిళా సంఘాలకు ఈ ప్రాంతాలను అప్పగించారు. హన్మకొండలోని మడికొండ, ఖమ్మంలోని వెంకటాపురం, సాదిరెడ్డిపల్లి, ఖానాపురం హవేలీ, కామారెడ్డిలో మల్తుమ్మెద, కొత్తగూడెం రామవరం, జగిత్యాల లోని కోరుట్ల, జనగామలోని రఘునాథ పల్లి, భూపాలపల్లిలోని మైలారం, మహబూబ్ నగర్ పాలకొండలను అప్పగించారు.
భూములను గుర్తించి అప్పగిస్తున్న అధికారులు
మేడ్చల్ లోని అలియాబాద్, మంచిర్యాలలోని మందమర్రి, నాగర్ కర్నూల్ మన్ననూరు, పెద్దా పూర్. నిర్మల్ లోని సోఫానగర్, రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్ నగర్, వట్టి నాగులపల్లి, వనపర్తిలోని మిరాస్ పల్లి, సూర్యాపేటలోని హుజూర్ నగర్, వరంగల్ లోని రాయపర్తి, సంగారెడ్డి కవేలి. కోడూరు, భువనగిరిలోకి మల్కాపురం లలో భూములను అప్పగించారు. అంతేకాదు సిద్ధిపేట, నిజామాబాద్, భువనగిరి, జోగులాంబ గద్వాల్ నారాయణపురం, భూపాల్ పల్లి కాళేశ్వరం, సూర్యాపేట రేపాల్, మహబూబాబాద్ తానంచెర్ల లలో భూములను గుర్తించారు. వీటిని మహిళా సంఘాలకు అప్పగించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications