ఈద్ ముబారక్ : గవర్నర్ ఇప్తార్ విందుకు కేసీఆర్, జగన్
హైదరాబాద్ : రాజ్ భవన్ లో అరుదైన దృశ్యం అవిష్కృమైంది. రంజాన్ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇప్తార్ విందు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ విందుకు హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు, వైసీపీ నేతలు, ముస్లిం ప్రముఖులు విందులో పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందు ..
రాజ్ భవన్ సాంస్కృతిక మందిరంలో నరసింహన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం మత పెద్దలు కూడా పాల్గొన్నారు. జగన్, కేసీఆర్ ఒకరికొకరు స్వీటు తినిపించుకున్నారు. తర్వాత మంత్రులు, నేతలు ఒకరికొకరు స్వీటు తినిపించుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు గవర్నర్ నరసింహన్ సహా .. కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు చెప్పారు.

ఇఫ్తార విందులో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు సందర్భంగా రాజ్‌భవన్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రముఖుల రాకతో రాజ్‌భవన్ సందడిగా మారింది.
కీలక భేటీ ..
అంతకముందు ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. విభజన చట్టంలోని కొన్ని అంశాలపై వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని అంశాలతో పాటు హైదరాబాద్‌లో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు అప్పగింత, ఉమ్మడి రాజధానిలోని సంస్థల ఆస్తులు, ఉద్యోగుల విభజన తదితర సమస్యలపై చర్చకొచ్చింది.
సమస్యలన్నింటినీ సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్న నేపథ్యంలో గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. విభజన అంశాలపై ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, తదుపరి వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications