హైదరాబాద్‌ను వదలరా?: కేసీఆర్ కంటే ఎక్కువ.., ఏపీకి గవర్నర్ షాక్?

ఏపీకి చెందిన నేతలు, పలువురు అధికారులు కలిసినప్పుడు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వారికి ఓ ప్రశ్న వేస్తున్నారట.

Recommended Video

    Governor Narasimhan Asking AP Leaders About Hyderabad Vacate | Oneindia Telugu

    హైదరాబాద్: ఏపీకి చెందిన నేతలు, పలువురు అధికారులు కలిసినప్పుడు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వారికి ఓ ప్రశ్న వేస్తున్నారట. హైదరాబాద్‌లో కార్యాలయాలు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.

     పలు ఆఫీస్ భవనాలు ఏపీ ఆదీనంలో

    పలు ఆఫీస్ భవనాలు ఏపీ ఆదీనంలో

    రాజ్‌భవన్‌లో జరిగే ఎట్‌హోం కార్యక్రమం నుంచి బయట జరిగే అధికారిక కార్యక్రమం వరకు ఎక్కడ కలిసినా గవర్నర్‌ నరసింహన్ సూటిగా ఇదే ప్రశ్న అడుగుతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్‌లో సచివాలయంలో కేటాయించిన బ్లాకులు, సీఎం క్యాంప్‌ కార్యాలయంగా కొనసాగుతున్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్‍‌తో పాటు మరికొన్ని ఆఫీస్‌లు ఏపీ ఆధీనంలో ఉన్నాయి.

     లేక్ వ్యూను ఉపయోగిస్తున్న చంద్రబాబు

    లేక్ వ్యూను ఉపయోగిస్తున్న చంద్రబాబు

    ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడైనా హైదరాబాద్‌ వస్తే లేక్‌వ్యూ అతిథి గృహాన్ని తన క్యాంప్‌ కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు, రాష్ట్రానికి చెందిన అధికారులకు హైదరాబాద్‌లోనూ వసతి, కార్యాలయాలు అవసరమున్నాయి.

     ఇన్ని అవసరాలు ఉన్నాయి

    ఇన్ని అవసరాలు ఉన్నాయి

    ఆస్తుల విభజన, కేంద్ర ప్రతినిధులు, ఇతర పలు సందర్భాల్లో హైదరాబాద్‌కు వచ్చి చర్చించవలసి వస్తుందని, అప్పుడు ఈ కార్యాలయాలు ఉపయోగపడుతున్నాయని, అలాంటప్పుడు హైదరాబాదులో భవనాలు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారని అడగడం సరికాదని ఏపీ నాయకులు, అధికారులు వాపోతున్నారని అంటున్నారు.

     మరిన్ని అవసరాలు

    మరిన్ని అవసరాలు

    విభజన చట్టంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. అయితే, అంతకాలం ప్రజలకు దూరంగా ఉండి పాలన చేయడం సరికాదనే ఉద్దేశ్యంతో సచివాలయం తరలించారు. ఉంటే ఇక్కడ అభివృద్ధి ఆలస్యం అవుతుందని, ప్రజలకు దూరంగా పాలన సాగుతుందనే ఉద్దేశంతో సచివాలయాన్ని తరలించారు. ఇతర కార్యాలయాలను కూడా అమరావతికి తీసుకు వచ్చారు. కానీ మరిన్ని అవసరాలు ఉన్నాయని చెబుతున్నారు.

     గవర్నర్ అలా అడగటం ఏమిటి

    గవర్నర్ అలా అడగటం ఏమిటి

    ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదని, అలాగే, పలు సందర్భాల్లో హైదరాబాద్ రావాల్సి వస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు వస్తాయని, అందుకే తాము హైదరాబాద్‌లోని కార్యాలయాలను అప్పగించలేమని ఏపీ చెబుతోంది. కానీ గవర్నర్ అలా అడగడం సరికాదని చెబుతున్నారు.

     వాటి గురించి మాట్లాడరేం?

    వాటి గురించి మాట్లాడరేం?

    హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలపై కేసీఆర్ గవర్నమెంట్ కంటే గవర్నర్ ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నారని ఏపీ నేతలు వాపోతున్నారు. పంపకాల విషయంలో స్పందించని గవర్నర్.. హైదరాబాద్‌లో ఖాళీ చేయడం గురించి మాట్లాడటం ఏమిటని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+