టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం - గవర్నర్ ఆమోదం..!!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త ఛైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించింది. టీఎస్పీఎస్సీ నూతన ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోద ముద్ర వేసారు. కొత్త ఛైర్మన్ తో పాటుగా ప్రభుత్వం సభ్యులను నియమించింది. ఛైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. పరిశీలన తరువాత కొత్త కమీషన్ ఖరారు చేసింది.
మాజీ డీజీపీ ఛైర్మన్ గా : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. అంతకు ముందు ఈ పదవిలో జనార్దన్ రెడ్డి ఉన్నారు. పలు కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు సభ్యులూ రాజీనామా చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ నిర్వహణలో లోపాలు.. పరీక్షా పత్రాల లీకేజీలతో రేవంత్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నాటి వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

సభ్యుల నియామకం : టీఎస్పీఎస్సీ నియామకం విషయంలో యూపీఎస్సీ అమలు చేస్తున్న విధానాలను సీఎం రేవంత్ పరిశీలించారు. ఆ తరువాత కమీషన్ నియామకం..పరీక్షల నిర్వహణ పైన ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను పరిశీలించిన తరువాత మాజీ డీజీపీ మహీందర్ రెడ్డి పేరును ఖరారు చేసారు. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై రాంమోహన్ రావు నియమితులయ్యారు. 1962 డిసెంబర్ 3న జన్మించిన మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మహేందర్ రెడ్డి ఐపీఎస్‌గా 36 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలందించారు.

కీలక నిర్ణయాల దిశగా : పోలీసు శాఖలో సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు మహేందర్ రెడ్డి. 2022, డిసెంబర్ 31వ తేదీన మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేశారు. మొత్తం 370 వరకు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పోస్టింగ్ దరఖాస్తులు రావటంతొ ప్రభుత్వం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసి ఎంపిక బాధ్యత అప్పగించింది. కమిటీ చేసిన సిఫార్సు మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక, ఇప్పుడు కొత్త కమిషన్ ఏర్పాటు కావటంతో పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ల మేరకు ఉద్యోగాల భర్తీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పరీక్షల నిర్వహణ పైన ఇప్పుడు ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల పైన నిరుద్యోగులు ఆసక్తిగా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications