Hyderabad: సిటీలో నేటి నుంచి గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు, ప్రత్యేకతలివే

హైదరాబాద్: రాజధాని నగరంలో పర్యావరణ హితమైన గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు నేటి(బుధవారం) నుంచి పరుగులు తీయనున్నాయి. పర్యావరణ హితమైన బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) అందుబాటులోకి తీసుకొచ్చింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ నగరవాసులను మరింత సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. పర్యావరణ హితమైన బస్సులను పెంచే దిశలో భాగంగా టీఎస్ఆర్టీసీ ఈ బస్సులను ప్రవేశపెడుతోంది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో మొదటి విడతగా బుధవారం 25 బస్సులను ప్రారంభించనున్నారు.

green metro luxury ac buses will start running in greater hyderabad from today

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గచ్చిబౌలి స్టేడియం వద్ద బుధవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా పాల్గొననున్నారు. మిగిలిన 25 బస్సులను నవంబర్ నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది.

ఈ బస్సులు వంద శాతం వాయు కాలుష్యాన్ని వెదజల్లవని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. మూడు గంటల నుంచి 4 గంటలలోపు వందశాతం పూర్తి ఛార్జింగ్ అవ్వడమే కాకుండా క్యాబిన్, సెలూన్ లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు, ఒక నెల బ్యాకప్ సదుపాయాలు కలిగి ఉన్నాయి ఈ బస్సులు.

గ్రీన్ ఎనర్జీ బస్సుల ప్రత్యేకత విషయానికొస్తే.. 12 మీటర్ల పొడవు గల ఈ గ్రీన్ లగ్జరీ ఏసీ బస్సులు అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉన్నాయి. 35 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ బస్సుల్లో ప్రతీ సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం, రీడింగ్ ల్యాంప్ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం ఉంది. వీటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు.

ప్రతి బస్సులోనూ రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ కలిగి ఉన్నాయి. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంది. బస్సు ముందు వెనుక ఎల్ఈడీ బోర్డులు గమ్యస్థానాల వివరాలతో ఉన్నాయి. ప్రయాణికులకు సమాచారం చేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం ఈ బస్సుల్లో ఉంది. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి.. నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+