Group-3: గ్రూప్-3 అభ్యర్థులకు గమనిక.. వెబ్ సైట్ లో అందుబాటులోకి హాల్ టికెట్లు..

టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. నవంబర్ 17,18 తేదీల్లో జరగనున్న గ్రూప్-3 పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. అభ్యర్థుల అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. హాల్ టికెట్ డౌన్ లోడ్ సమయంలో ఏదైనా సమస్య వస్తే టీజీపీఎస్సీ అధికారులను సంప్రదించాలని కోరింది. తెలంగాణలో 1,380 గ్రూప్-3 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది.

ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,36,477 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-3 పరీక్షలు నవంబర్17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. మూడు పేపర్లుగా పరీక్ష జరపనున్నారు. నవంబర్ 17న రెండు పేపర్లు, నవంబర్ 18న ఒక పేపర్ నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. రెండో రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మూడో పేపర్ నిర్వహిస్తారు.

Group-3 exam hall tickets are available on the official website of TGPSC

ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి. మొత్తం 450 మార్కులు ఉంటాయి. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలు ఉండగా.. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయి. అభ్యర్థి భాష ఎంపిక ప్రకారం ఆ లాగ్వేజ్ లో పేపర్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉండదు. పరీక్ష టైంకు గంటన్నర ముందే సెంటర్‎లోకి అభ్యర్థులను అనుమతించనున్నారు.

అరగంట ముందే పరీక్ష సెంటర్ల గేట్లు మూస్తారు. అభ్యర్థులు హాల్ టికెట్‎తో పాటు, క్వశ్చన్ పేపర్లను సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టీజీపీఎస్సీ ఇప్పటికే విజయవంతంగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించింది. త్వరలో గ్రూప్-2 పరీక్షలు కూడా నిర్వహించనుంది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+