'రుద్రమదేవి'కి పన్ను మినహాయింపు చరిత్రాత్మకం: కెసిఆర్ ప్రశంసతో గుణశేఖర్ భావోద్వేగం
హైదరాబాద్: కాకతీయ వైభవంపై తెరకెక్కించిన 'రుద్రమదేవి' చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపునిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీసుకొన్న నిర్ణయం ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని దర్శక, నిర్మాత గుణశేఖర్ చెప్పారు.
కథానాయిక అనుష్క, సహనిర్మాత గుణ, నైజాంలో చిత్రాన్ని పంపిణీ చేస్తున్న దిల్‌రాజులతో కలిసి గురువారం ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. అనంతరం చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో గుణశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
మన సంస్కృతిని చాటిచెప్పే ఓ గొప్ప చిత్రం తీశావని మెచ్చుకొంటూ, ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని ముఖ్యమంత్రి అక్కడిక్కడే పన్ను మినహాయింపు ఉత్తర్వులు జారీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని భావోద్వేగానికి గురవుతూ చెప్పారు.

రుద్రమదేవికి పన్ను మినహాయింపునివ్వడం కళలపట్ల, చరిత్ర పట్ల సీఎంకు ఉన్న గౌరవాన్ని చాటి చెబుతోందన్నారు. ఆయన సాహితీప్రియుడు కావడంతో కాకతీయ చరిత్రకు సంబంధించిన చాలా విషయాల్ని మాతో పంచుకొన్నారని, కొన్ని శాసనాల గురించి కూడా సిఎం కెసిఆర్ చెప్పారని గుణశేఖర్ తెలిపారు.
గుణశేఖర్ కలిసిన సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... ఇలాంటి చిత్రాలు మరెన్నో నిర్మించాలన్నారు. చారిత్రక చిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా, శుక్రవారం ‘రుద్రమదేవి' చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications