తెలంగాణలోని 'బాహుబలి వాటర్ ఫాల్స్'.. అస్సలు వదిలి రావాలని అనిపించదు భయ్యా..!
తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలామందికి వాటర్ ఫాల్స్ అనగానే కేరళ, తమిళనాడు, కర్ణాటక వెళ్లాలని అనిపిస్తుంది. కానీ తెలంగాణలోనే ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో ఓ వాటర్ ఫాల్ ఉందని తెలుసా..? అదే కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని గుండాల జలపాతం. దీనినే 'బాహుబలి వాటర్ ఫాల్స్'అని కూడా అంటారు. ఇది తీర్యాని మండలంలోని దట్టమైన అడవిలో ఉంది. ఈ జలపాతానికి నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. భారీ వర్షాల సమయంలో జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ బాహుబలి సినిమాలోని జలపాతాన్ని తలపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడి జలధార టూరిస్టులను చూపు తిప్పుకోనివ్వదని చెబుతుంటారు.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో బాహుబలి వాటర్ ఫాల్స్ ఉద్ధృతంగా కూడా పరవళ్లు తొక్కుతోంది. ఆదిలాబాద్ , నిర్మల్ జిల్లాలతో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర నుండి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు ఈ జలపాతం అందాలను తిలకించేందుకు తరలివెళుతున్నారు. పచ్చదనం నిండిన అడవిలో ఏకధాటిగా 125 అడుగుల ఎత్తు నుండి సెలయేర్లతో గుండాల బాహుబలి జలపాతం జాలువారుతుంది.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి తిర్యాని మండలం నుండి రొంపల్లి రాళ్ల బాటలో కాలినడకన 7 కిలోమీటర్ల దూరంలో గుండాల గ్రామం ఉంటుంది. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. మరొక దారి దండేపల్లి మండలం ఉట్ల ఊరి నుండి ప్రకృతి సహజ సౌందర్య మైన కొండలు, లోయలు వాగులు దాటుతూ గుండాల గ్రామాన్ని, గుండాల బాహుబలి జలపాతాన్ని చేరుకోవచ్చు.












Click it and Unblock the Notifications