విద్యార్థులకు ఇక పండగే...అక్టోబర్ నెలలో పాఠశాలలకు సెలవులే సెలవులు..
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు దసరా పండుగ ముందే వచ్చింది. ఎందుకంటే, రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ నెలలో సెలవుల మీద సెలవులు రాబోతున్నాయి. ఈ ఏడాదిలో అత్యధికంగా పండగలు వస్తున్నాయి. అదికూడా అక్టోబర్ నెలలోనే దసరా, దీపావళి పండుగలు రావడంతో పాఠశాలలకు ఎక్కువరోజులు సెలవులు వచ్చాయి. దసరా నుంచి దీపావళి వరకు మొత్తంగా అక్టోబర్ మాసంలో 16 రోజులపాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. అక్టోబరు 2వ తేది నుంచి 14వ తేది వరకు 13 రోజులపాటు దసరా సెలవులు రానున్నాయి. రాష్ట్రంలో అక్టోబరు 15వ తేదిన తిరిగి పాఠశాలలు తెరచుకోనున్నాయి.
దసరా పండుగకు ముందు రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంబురాలు మొత్తం 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఎంగిలి బతుకమ్మ పండుగ అక్టోబర్ 2వ తేదీన ఉండనుంది. ఆ రోజు గాంధీ జయంతి సందర్భంగా పాఠశాలలకు ఎలాగో సెలవు ఉంటుంది. ఆ తర్వాత దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలను ముగిస్తారు.. అంటే దసరా పండుగకు రెండు రోజుల ముందు తెలంగాణ ప్రజలు సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోనున్నారు.

రాష్ట్రంలోని పాఠశాలల్లో అక్టోబరు 21వ తేది నుంచి 28 తేది వరకు 'సమ్మేటివ్ అసెస్‌మెంట్(SA)-1' పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ఇదే నెలలో మరో సెలవు రానుంది. అక్టోబరు 31వ తేదిన దీపావళి పండుగ. దీవాళీ సందర్భంగా ఆ రోజున సెలవు ఉంటుంది. దీంతో ఆ 14 రోజులు దసరా పండుగల సెలవులతోపాటు, అక్టోబరు 20, 27తేదీల్లో ఆదివారాలు కలిపి, అక్టోబరులో మొత్తం 16 రోజులు పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే అక్టోబరులో కేవలం 14 రోజులు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయి. ఈ వార్త విద్యార్థులకు పండగే అని చెప్పుకోవాలి.
పరీక్షల వివరాలివే..
వచ్చేనెల 21వ తేది నుంచి 28 వ తేది వరకు రాష్ట్రంలో సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA)-1 పరీక్షలు జరగున్నాయి. డిసెంబర్ 12వ తేది లోపు ఫార్మాటివ్ అసెస్‌మెంట్ (FA)-3 పరీక్షలు కాగా, 2025 జనవరి 29 లోపు ఫార్మాటివ్ అసెస్‌మెంట్ (FA)-4 పరీక్షలు పూర్తి కానున్నాయి. పదోతరగతి వార్షిక పరీక్షలు 2025 మార్చి నెలలో నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications