ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయం వేళ కీలక పరిణామం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచాయితీ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఇద్దరు మినహా మిగిలిన వారి విచారణ స్పీకర్ పూర్తి చేసారు. దానం, కడియం ఇద్దరూ సమయం కోరారు. అటు సుప్రీంకోర్టు నిర్దయం పైన సమయం నిర్దేశించింది. ఈ సమయంలోనే ఎమ్మెల్యేల అనర్హత తో పాటుగా అసెంబ్లీ వ్యవహారాల పైన ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రాసిన లేఖ సంచలనంగా మారుతోంది.
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గడ్డం ప్రసాద్ కుమార్‌కి మాజీ మంత్రి హరీశ్ రాసిన లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. ఈ రెండేళ్లలో అసెంబ్లీ నిర్వాహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యా లు, నిబంధనల ఉల్లంఘనలపై ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రతిష్ఠను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో జరుగుతున్న పొరపాట్లను ఆ లేఖలో ఎండగట్టారు. శాసనసభ పని దినాలు గణనీ యంగా తగ్గిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రూల్ 12 ప్రకారం సభా కార్యకలాపాలకు అవ సరమైనన్ని రోజులు సభను నిర్వహించాల్సి ఉన్నా, అది జరగడం లేదని పేర్కొన్నారు. అలాగే, సరైన కారణాలు లేకుండా సభను తరచూగా, హఠాత్తుగా వాయిదా వేయడం సభా సమయానికి సంబంధించిన రూల్ 13తో పాటు వాయిదా పద్ధతులకు సంబంధించిన రూల్ 16లకు విరుద్ ధమని తెలిపారు. సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకు ఉన్న ప్రధాన క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వాహణలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రూల్స్ 38 నుంచి 52, అదేవిధంగా రూల్స్ 53 నుంచి 62 వరకు ఉన్న నిబంధనలను పాటించడం లేదని ప్రస్తావించారు.

సభలో మంత్రుల నుంచి నేరుగా సమాధానం వచ్చే స్టార్డ్ క్వశ్చన్స్ చర్చకు రాకుండా చేస్తున్ నారని, తద్వారా రూల్ 38 కల్పించిన ప్రశ్నల సమయ హక్కును కాలరాస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. గత రెండేళ్లుగా అసెంబ్లీలో హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ, ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు.డిప్యూటీ స్పీకర్ నియామకం జరగకపోవడం మరో ప్రధాన ఉల్లంఘన అని ప్రస్తావించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని అసహనం వ్యక్తం చేశారు. అనర్హత పిటిషన్లపై రాజ్ యాంగం, చట్టంతో పాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకో వాలని హరీశ్‌రావు సూచించారు.












Click it and Unblock the Notifications