జూరాలకు కర్ణాటక నీళ్లిచ్చేనా..! హరీశ్ రావు ప్రయత్నాలు..
తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో.. తెలంగాణలో తాగునీటి ఎద్దడి నెలకొన్న విషయం తెలిసిందే. ఎండాకాలం పూర్తవడానికి ఇంకా రెండు నెలల సమయం ఉండడం, రాష్ట్రంలోని జలాశాయాలన్నీ ఎండిపోవడం మరింత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ తో సమావేశమయ్యారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. బెంగుళూరులో జరిగిన ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావుతో పాటు ఇతర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడి దృష్ట్యా.. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీళ్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాజోలిబండ నీటి మళ్లింపు పథకం ఎత్తు పెంపుపై ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య సుదీర్ఘమైన చర్చ జరిగినట్టుగా సమాచారం. దీంతో పాటు ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయించినప్పటికీ, ఐదారు టీఎంసీలకు మించి తెలంగాణకు అందట్లేదని మంత్రులు పాటిల్ కి వివరించారు.

మొత్తం సమస్యలపై విజ్ఞాపన పత్రం అందజేసిన మంత్రులు.. పెండింగ్ లో ఉన్న కాలువల పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయించాలని కర్టాటక ఇరిగేషన్ మంత్రిని కోరారు. జూరాలకు నీళ్ళిచ్చే విషయంపై స్పందిస్తూ.. నారాయణపూర్ డ్యాం కి సంబంధించి సమగ్ర వివరాలు సేకరించి సమీక్ష నిర్వహించిన తర్వాతే తెలంగాణకు నీళ్ళు ఇచ్చే అంశం గురించి ఆలోచిస్తామని కర్ణాటక రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి పాటిల్ తెలంగాణ మంత్రులకు తెలిపినట్టుగా సమాచారం.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications