ఫార్ములా ఈ రేస్ కేసుపై రేవంత్ సర్కార్ హడావిడి వెనుక అసలు కథ ఇదేనట!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కావాలని కేటీఆర్ ని ఇరికిస్తున్నారని వ్యాఖ్యలు చేసిన ఆయన రేవంత్ రెడ్డి అరెస్టయి జైల్లో పడటానికి కేటీఆర్ పై కేసుకి పొంతనలేదని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డిని వదిలిపెట్టబోము: హరీష్ రావు
రేవంత్ రెడ్డి డబ్బులు కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు వెళ్ళాడని, కేటీఆర్ తెలంగాణ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడాన్ని కేటీఆర్ అక్రమ కేసుకి పోల్చడం మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్టుగా అవుతుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎన్ని రకాల కేసులు పెట్టినా సరే రేవంత్ రెడ్డిని వదిలిపెట్టబోమని హరీష్ రావు స్పష్టం చేశారు.

Harish Rao said the real story behind Revanth govt rush over the Formula E race case

కేటీఆర్ పైన కాంగ్రెస్ నేతలది తప్పుడు ప్రచారం
కాంగ్రెస్ నేతలు కేటీఆర్ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేస్తారా? అంటూ నిలదీసిన హరీష్ రావు తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదని, ప్రభుత్వం అవినీతి జరిగిందని చెప్పినప్పుడు విచారణ చేసుకోమని మాత్రమే కోర్టు చెప్పిందని ఆయన పేర్కొన్నారు.

కోర్టు తీర్పు కాపీ చదివాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం
గతంలో కూడా కేటీఆర్ విచారణకు సిద్ధమని చెప్పారని గుర్తు చేసిన ఆయన ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా అన్న అంశం పైన మా లీగల్ సెల్ నిర్ణయిస్తుందని తెలిపారు.
నేటి కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో హరీష్ రావు హైకోర్టు తీర్పు పూర్తి కాపీ చదివిన తర్వాత తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామన్నారు. అసలు ఫార్ములా ఈ రేస్ లో ఒక రూపాయి కూడా చేతులు మారినప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుందని హరీష్ రావు ప్రశ్నించారు.

కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్న కారణంగానే కేటీఆర్ పై కేసు పెట్టారని, డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల ప్రజల మైండ్ డైవర్షన్ కోసం ఇప్పుడు ఈ కేసును తెరమీదకి తీసుకువచ్చారని హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన తెలిపారు.

ఇంతకు పదింతలు తిరిగిస్తాం
సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులపై చిచ్చరపిడుగుల్లా పోరాడిన చరిత్ర మాదని, ఎన్నో పోరాటాలతో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని అటువంటి పోరాటపటిమ తమలో ఉందని హరీష్ రావు తెలిపారు. తప్పకుండా రేవంత్ రెడ్డికి ఇంతకు పదింతలు వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+