కౌశిక్ పై దాడి వెనుక ఆయనే - హరీష్ కీలక వ్యాఖ్యలు..!!

మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల పైన దాడులు చేసిన వారి పైన చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. ముందస్తుగానే గాంధీని అరెస్ట్ చేస్తే కౌశిక్ ఇంటి పైన దాడి జరిగిది కాదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన హైకోర్టు మొట్టికాయలు వేయటంతో రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

తాజాగా కౌశిక్ - గాంధీ వివాదంలో బీఆర్ఎస్ నేతల అరెస్ట్ ను హరీష్ తప్పు బట్టారు. కౌశిక్ పై దాడి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడితే ఆ పార్టీ వాళ్లు అదే విధంగా వ్యవహరిస్తున్నారని హరీష్ చెప్పుకొచ్చారు. తమను ఈ రోజు ముందస్తు నిర్బంధం చేసినట్లు గాంధీని ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే కౌశిక్ ఇంటి పై దాడికి అవకాశం ఉండేది కాదని పేర్కొన్నారు.

Harish Rao slams CM Revanth over Gandhi episode and Arrests

ఈ గొడవలకు ముఖ్యమంత్రి కారణమని హరీష్ మండిపడ్డారు.కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి గొడవలు ఎక్కడా జరగలేదన్నారు. ఇప్పుడు ఇష్టాను సారం మాట్లాడతున్న దానం నాగేందర్ బీఆర్ఎస్ లో ఉన్న సమయంలో ఎప్పుడైనా ఇలా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఆంధ్ర, తెలంగాణ అంటూ మాట్లాడుతున్నా రని..కేసీఆర్ హైదరాబాద్ లో ఉన్న ప్రతీ ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారని గుర్తు చేసారు. పీఏసీ ఛైర్మన్ ఎంపిక విషయంలో హైడ్రామా జరిగిందన్నారు. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు ఈ గొడవలకు ప్లాన్ చేసారని హరీష్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+