హైదరాబాద్‌లో మళ్లీ దంచికొట్టిన వాన: రోడ్లపైకి వరద, భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా భారీ వర్షంతో వరదనీరు రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

బాలానగర్, జీడిమెట్ల, నాంపల్లి, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, తార్నాక, కోఠి, సరూర్ నగర్, రామాంతపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, పెద్దఅంబర్ పేట తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మలక్ పేట, దిల్‌‌సుఖ్‌నగర్, సైదాబాద్, చంపాపేట, చాదర్ ఘాట్ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Heavy rain in Hyderabad city on Friday night

కూకట్‌పల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్, బోడుప్పల్ పీర్జాదిగూడ ప్రాంతాల్లోనూ వాన పడుతోంది. ఇక, శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. రహదారులపైకి వరద రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రోడ్లపై నిలిచిన వరదనీటి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు, కొమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+