హైదరాబాద్‌లో భారీ వర్షం: రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్ పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, తిరుమలగిరి, అల్వాల్, కవాడిగూడ, దోమలగూడ, విద్యానగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, అడిక్‌మెట్, బేగంపేట్, బంజారాహిల్స్, కీసర, చర్లపల్లి, కుషాయిగూడ, ఏఎస్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.

భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎర్కొన్నారు. వర్షం, వరదనీరు కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

heavy rain in some parts of hyderabad city

మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అంతేగాక, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం, శనివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.

ఏపీలోనూ మూడు రోజులపాటు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ మరో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీస్తాయని ఐఎండీ తెలిపింది. గురువారం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య . చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+