హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం: వరదలో కొట్టుకుపోయిన బిర్యానీ హండీలు(వీడియో)

హైదరాబాద్: రాజధాని నగరంలో ఆదివారం ఉదయం నుంచి మేఘావృతమై ఉండగా.. రాత్రి ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరింది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం

హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం

హైదరాబాద్ నగరంలోని లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, మియాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, మెహదీపట్నం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం

రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం

కవాడిగూడ, దోమలగూడ, భోలక్‌పూర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్, జవహర్‌నగర్, గాంధీనగర్, చాదర్‌​ఘాట్, మలక్‌​పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం పడింది. రాజేంద్రనగర్, కిస్మత్‌పూరా, బండ్లగూడ జాగీర్‌, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ, అత్తాపూర్‌లోనూ కుండపోత వర్షం పడింది. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. ఆదివారం రాత్రి మరోసారి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు తిప్పలు తప్పలేదు.

భారీ వర్షంతో తప్పని ఇబ్బందులు

జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వర్షం నీటిని మళ్లించేందుకు ప్రయత్నం చేశఆరు. బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు తప్పలేదు. ఇది ఇలావుండగా, మరో మూడు రోజులపాటు హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.

వరదలో కొట్టుకుపోయిన బిర్యానీ హండీ

ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంలోని ఓ ప్రాంతంలో రెస్టారెంట్‌లోని బిర్యానీ హండి వరదనీటిలో కొట్టుకుపోయింది. దీంతో వర్షంలో వేడి వేడిగా బిర్యానీ తిందామని వచ్చే బిర్యానీ అభిమానులకు నిరాశే మిగిలింది. బిర్యానీ హండీ వరదనీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలను వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+