హైదరాబాద్‌లో భారీ వర్షం: వడగళ్ల వానతో జనం ఇబ్బందులు, శోభయాత్రలకు ఆటంకం
హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం మధ్యాహ్నం వరకు కాస్త ఎండగా అనిపించినా.. సాయంత్రం నుంచి హైదరాబాద్(Hyderabad) నగరంలోని చాలా ప్రాంతాల్లో మేఘావృతమై భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో వాతావరణం చల్లగా మారిపోయింది.
హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల వడగళ్ల వాన కురవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నగరంలో పలు చోట్ల నిర్వహిస్తున్న శోభయాత్రలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కర్మాన్‌ఘాట్ దగ్గర హనుమాన్ శోభయాత్ర కాసేపు ఆపేశారు. వర్షం తగ్గిన తర్వాత శోభయాత్రను మళ్లీ ప్రారంభించారు.

ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, మలక్‌పేట్, కర్మన్‌ఘాట్, హిమాయత్‌నగర్, నల్లకుంట, నారాయణగూడ, అంబర్‌పేట, కోఠి, మల్కాజిగిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తార్నాక, అంబర్‌పేట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
HyderabadRains #HyderabadRain
— VamsiNTRfan™🤙 (@boddukrishnavam) April 6, 2023
It's pelting of ice from Sky
Lets everyone stay inside home @HiHyderabad @Hyderabadrains#hyderabadrain pic.twitter.com/nKsSmArxgv
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, కరీంనగర్ తదితర జిల్లాలో వర్షం కురుస్తోంది. రానున్న మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది.
Part of Hyderabad Secunderabad witnessed rain and hailstorm. #WeatherUpdate pic.twitter.com/BV0Y7EY9eX
— Ashish (@KP_Aashish) April 6, 2023
శుక్రవారం కూడా హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బయటికి వెళ్లేవారు తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్ కు ఎల్లో అల్ర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications