హైదరాబాద్‌లో కుండపోత వర్షం: నగరవాసికి తప్పని తిప్పలు, జీహెచ్ఎంసీ అలర్ట్

హైదరాబాద్: నగరంలో మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపించాడు. సోమవారం సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం, వరదనీరుతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‌లో జోరు వాన

హైదరాబాద్‌లో జోరు వాన

ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్‌, వనస్థలిపురం, హయత్‌నగర్, తుర్కయాంజాల్‌, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, చైతన్యపురి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట, కొత్తపేట, కర్మన్‌ఘాట్, సంతోష్ నగర్, చాదర్‌ఘాట్‌, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, విద్యానగర్‌, ఓయూ క్యాంపస్, తార్నాక, లాలాపేట్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, తదితర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి జోరు వాన కురిసింది.

రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం

రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం

కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. రహదారులపై నీరు పొంగిపొర్లడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

జీహెచ్ఎంసీ అలర్ట్: మరో 3-4 రోజులపాటు వర్షాలు

జీహెచ్ఎంసీ అలర్ట్: మరో 3-4 రోజులపాటు వర్షాలు

సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డీఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను బల్దియా అలర్ట్ చేసింది. అవసరమైతే తప్ప నగర ప్రజలు ఇంటి నుంచి బయటికి రాకూడదని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+