HYD Traffic Alert: నేటి నుంచి కొత్త రూల్స్, మధ్యాహ్నం 2 గంటలకే ఇంటికి!

హైదరాబాద్ మహానగరంలో రానున్న కొన్ని రోజులు ట్రాఫిక్ పరంగా అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. ఒకపక్క వాతావరణ శాఖ హెచ్చరించిన భారీ వర్ష సూచన, మరోపక్క వినాయక నిమజ్జన శోభాయాత్రలు.. ఈ రెండూ ఒకేసారి తోడవ్వడంతో సైబరాబాద్ పరిధిలో రోడ్లపై తీవ్ర రాకపోకల అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జనం ఇబ్బంది పడకుండా ఉండేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు.

ట్రాఫిక్ చిక్కులను నివారించేందుకు ఐటీ సంస్థలు, ఇతర ప్రైవేట్ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. సెప్టెంబర్ 18 నుంచి 25వ తేదీ వరకు ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆఫీసులకు వచ్చే ఉద్యోగుల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచే విడతల వారీగా (Staggered Logouts) త్వరగా పంపించి వేయాలని సూచించారు. దీనివల్ల సాయంత్రం వేళల్లో రోడ్లపై ఒక్కసారిగా రద్దీ పెరగకుండా నివారించవచ్చని భావిస్తున్నారు.

Heavy Rainfall amp amp Ganesh Immersion Cyberabad Traffic Police Recommends WFH and Virtual Classes Till Sept 25
వినాయక మండపాలకు అదిరిపోయే ఆఫర్.. అలా నిమజ్జనం చేస్తే రూ.10,116 నగదు పురస్కారం!
వినాయక మండపాలకు అదిరిపోయే ఆఫర్.. అలా నిమజ్జనం చేస్తే రూ.10,116 నగదు పురస్కారం!

విద్యార్థుల భద్రతే ముఖ్యం: ఆన్‌లైన్ క్లాసులకు ఆదేశం

వర్షాలు, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా విద్యార్థులు, చిన్నపిల్లలు పడే ఇబ్బందులను నివారించేందుకు విద్యాసంస్థలు కూడా కీలక నిర్ణయం తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి 25 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు ఆన్‌లైన్ లేదా వర్చువల్ మోడ్ లో పాఠాలు నిర్వహించాలని కోరారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల రిస్క్ తగ్గడమే కాకుండా, విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులకు చెక్ పడుతుందని స్పష్టం చేశారు.

దూసుకొస్తున్న అల్పపీడనం: పిడుగులు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
దూసుకొస్తున్న అల్పపీడనం: పిడుగులు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

పోలీసుల పిలుపు: సహకరిస్తేనే సురక్షిత ప్రయాణం

ఈ వారం రోజుల పాటు ట్రాఫిక్ వ్యవస్థ సజావుగా సాగేందుకు, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రైవేట్ సంస్థలు, స్కూళ్లు, ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులు, శోభాయాత్రల దృష్ట్యా ప్రయాణాలను వీలైనంత వరకు ప్రణాళికాబద్ధంగా మార్చుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+