Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం! భారీ వర్షాలు, వడగళ్లు

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నేటి వరకు తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో సతమతమైన రాష్ట్ర ప్రజలు వర్షాలు, చల్లని గాలులతో సేద తీరుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిశాయి.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని చాలా చోట్ల వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వర్షం కురిసింది. దర్పల్లిలోని వాడి గ్రామంలో వడగండ్ల వాన కురిసింది. దీంతో వరిధాన్యం నేలరాలింది.

Heavy rains hailstorm in some places in Telangana

కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోయింది. మెదక్ పట్టణం, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. మెదక్ పట్టణంలోని జంబికుంట వీధిలో ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఆ ఇంట్లోని సామాగ్రి ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో మనుషులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, మిర్దొడ్డి, తొగుట మండలాల్లో వర్షం పడింది.

మరో 24 గంటల్లో తెలంగాణలో వర్షాలు

శుక్రవారంతోపాటు శనివారం కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం కొన్ని జిల్లాల్లో వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయిన తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, రాగల మూడు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సామాన్యంగా ఉండటంతో పాటు క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించింది.

మరోవైపు, ఏపీలో ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్సాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+