హైదరాబాద్‌లో భారీ వర్షం: కొట్టుకుపోయిన కారు, జీహెచ్ఎంసీ హెచ్చరిక

హైదరాబాద్: నగరంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా మారిపోయి నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట, హైదర్‌నగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతినగర్‌, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట వర్షం కురిసింది.

బోరబండ, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్‌మెట్‌, అమీర్‌పేట్‌, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌​బాగ్, నారాయణగూడ, హిమాయత్​‌నగర్, ఖైరతాబాద్, లక్డికపూల్‌, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మేడ్చల్, కృష్ణాపూర్, మల్లంపేట్, గండిమైసమ్మ, దుండిగ, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో రహదారులపై వరద నీరు పొంగిపొర్లింది.

Heavy Rains in Hyderabad GHMC warning to city people

మోకాళ్ల లోతు నీరు రహదారులపై ప్రవహిస్తుండడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరం అంతటా వర్షం కురవడంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్​ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్​ఎంసీ యాక్షన్​ టీమ్స్ వర్షపు నీటికి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరు చాలాచోట్ల రహదారులు చెరువులను తలపించాయి.

వరదలో కొట్టుకుపోయిన వాహనాలు

ఈ వర్షానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణానగర్‌​లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు రావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో రోడ్లపై వర్షపు నీరు వరదలా మారింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీళ్లలో ఒక కారు కొట్టుకుపోయింది. స్థానికులు కారును ఆపాలనుకున్నా దూసుకువస్తున్న వరదను చూసి కారును చేరుకునే సాహసం చేయలేదు.

మరోవైపు, రాంనగర్​‌లోని స్ట్రీట్ నంబర్ 17లో వరద ఉధృతిలో ఓ కారు చిక్కుకుపోయింది. డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అందులో ఉన్న నలుగురు ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. చివరకు స్థానిక యువకుడు ప్రణీత్, అతడి స్నేహితులు తీవ్రంగా ప్రయత్నించి.. కారును గోడ పక్కకు తెచ్చారు. అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు.

జీహెచ్ఎంసీ హెచ్చరిక

భారీవర్షం కురవడంతో జీహెచ్​ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరసమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి రావొద్దని జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరికలు జారీచేశారు. మరో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వర్షానికి సంబంధించి ఏమైనా అత్యవసర సహాయం అవసరమైతే 040-21111111, 9000113667 ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+