భారీ వర్షాలతో బెదిరిస్తున్న నైరుతి రుతుపవనాలు!

అక్టోబర్ మాసంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు. నిన్నటి వరకు కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టి చలి పెరుగుతుంది అనిపించినా, మళ్లీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో నేడు, రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

నిష్క్రమిస్తున్న నైరుతి రుతుపవనాలు .. వర్షాలు
ఉత్తర భారతదేశం నుండి ప్రారంభమైన నైరుతీ రుతుపవనాల నిష్క్రమణ తెలంగాణ ప్రాంతానికి చేరుకుందని, 24వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 15వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

heavy rains in telangana today and tomorrow with the depature of mansoon in these districts

నేడు ఈ జిల్లాలలో వర్షాలు
దాదాపు 17జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, నాగర్ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలలో ఎడతెరిపిలేని వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ అంచనా వేసినట్టు నేడు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి .

ఈ ప్రాంతాలలో జోరువాన
నిన్న రాత్రి నుండి ఈరోజు తెల్లవారుజాము వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండలో అత్యధికంగా 190.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 131 మిల్లీమీటర్లు, మోతుకూరు మండలంలో దట్టప్ప గూడ లో 120.5 మిల్లీ మీటర్లు, మహబూబాబాద్ మండలం అయ్యగారి పల్లెలో 117.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

హైదరాబాద్ లో రాత్రికి వర్షాలు పడే అవకాశం
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్లోనూ పగలంతా వాతావరణం పొడిగా ఉంటుందని, రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరి మరియు పత్తి సాగు చేసిన రైతులు జాగ్రత్తగా ఉండాలని, పంట పాడైపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+