Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దూసుకొస్తోంది, భారీ వర్షాలు- మరో మూడు రోజులు, ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈ అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం కాగానే ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుంది. వేగంగా ఈదురు గాలులు వీచి అనేక జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

హైదరాబాద్​ తో సహా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మరాట్వాడా వరకు ద్రోణి ఒకటి సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వర్షం కొనసాగుతోంది. నగరం​లోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, గాంధీనగర్ తో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేడ్చల్​ జిల్లాలో ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం కాగానే ఒక్కసారిగా మబ్బులతో కమ్ముకుంది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక, అనేక జిల్లాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.

heavy-rains-in-telugu-states-for-next-coming-three-days-due-to-low-pressure-affect-as-imd-predictio

ఈదుగు గాలులు.. పంటలకు భారీ నష్టం

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి యాసంగి పంటలు గోధుమ, మొక్కజొన్న పంట లు నేలకొరిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో అకాల వర్షంతో జన జీవనం ఒక్కసారిగా స్తంభించింది. ఉరుములు మెరుపులతో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షాల కారణంగా మర్చి రైతులకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దుబ్బాక పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లోని చెట్లు నేలకొరిగాయి. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోనూ అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. కాగా, ఈ రోజు ఆదిలా బాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+