ALERT: హైదరాబాద్ లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం కారణంగా వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు, బాటసారులు చాలా ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీలు పొంగిపోవడంతో పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షం, ఈదురు గాలులకు నగరంలోని పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తుంది. గత కొన్ని రోజులతో ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
#HYDTPinfo#TrafficAlert #RainAlert
— Hyderabad Traffic Police (@HYDTP) April 3, 2025
Waterlogging at Madhura Sweet House. Please avoid both sides of the road from NMDC-Mehedipatnam and take alternate routes to prevent delays.#HyderabadRains #Rainfall #Raining pic.twitter.com/0y66eH6Txd
తిరుమలగిరి, బోయిన్ పల్లి, అల్వాల్, మారేడుపల్లి చిలకలగూడ ప్యాట్నీ ప్యారడైస్ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications