Weather Update: వాతావరణ శాఖ హెచ్చరిక.. 13, 14 తేదీల్లో భారీ వర్షాలు..!
నేడు, రేపు క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సెప్టెంబర్ 12, 13, 14 తేదీల్లో దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం లేదని వివరించింది. ఈ వర్షాకాలం అనుకున్న స్థాయిలో వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది.













Click it and Unblock the Notifications