తెలంగాణలో ఆ రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాల అలర్ట్

తెలంగాణలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయనుకుంటే మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ, మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం 8:30 గంటలకు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతుందని హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం బంగ్లాదేశ్ తీరం వద్ద సెప్టెంబర్ 9న వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

శుక్ర, శనివారాల్లో తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు వర్షాలతో పాటు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

Heavy to very heavy rain in Telangana on September 9 and 10th

అంతేగాక, సెప్టెంబర్ 9, 10 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 9న అతి భారీ వర్షాలు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

భారీ వర్షాలు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. 10న అతిభారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

ఇక, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. కాగా, వాయుగుండం ముప్పు మాత్రం తెలుగు రాష్ట్రాలకు తప్పిందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండనుందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+