ములుగుజిల్లా కొండాయికి హెలికాప్టర్; మంత్రి సత్యవతి రాథోడ్ చొరవ; సహాయక చర్యలు ముమ్మరం!!

ములుగు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ములుగు ఎమ్మెల్యే సీతక్క భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాలలో పర్యటించి ముంపు గ్రామాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. జోరువానను సైతం లెక్క చెయ్యకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న గ్రామాల ప్రజలను కాపాడాలని సీతక్క విజ్ఞప్తి చేస్తున్నారు.

ముఖ్యంగా కొండాయి పరిసర గ్రామాలు జంపన్న వాగు ఉధృతితో వరద ముంపులో చిక్కుకున్నాయి అని, దాదాపు 100 మందిని కాపాడాలని విజ్ఞప్తి చేసిన సీతక్క కన్నీరు పెట్టుకున్నారు. ఒక్క హెలికాఫ్టర్ పంపితే ఏ ఒక్కరి ప్రాణాలు పోకుండా కాపాడవచ్చన్నారు. దీంతో ఎమ్మెల్యే సీతక్క విన్నపాన్ని ప్రభుత్వం మన్నించింది.

Helicopter to Mulugu district Kondai; rescue operation continues with Minister Satyavathi Rathod initiative!!

దీంతో కొండాయిలో పరిస్థితులపై మంత్రి సత్యవతి రాథోడ్సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో ములుగు జిల్లా కొండాయికి హెలికాప్టర్ తో సహాయ చర్యలు చేపట్టారు. తెలంగాణ సీఎం కెసిఆర్ ఆదేశాలతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తుంటే తాజాగా ఆర్మీ హెలికాఫ్టర్ కూడా రంగంలోకి దిగింది.

మంత్రి సత్యవతి రాథోడ్ కొండాయిలో భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, కొండాయి లో జంపన్న వాగు వరదలో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, త్రాగునీరు, హెలికాప్టర్ ద్వారా అందిస్తున్నారు.

మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాలలో చిక్కుకున్నవారు ఎవరు ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.

అంతేకాదు ఏజెన్సీ ఏరియాలో వరద ప్రభావిత ప్రాంతాల పైన కూడా దృష్టి సారించిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలకు సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, ముంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలు సహాయం కోసం కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని సూచించారు.ములుగు, భూపాలపల్లి జిల్లాలలో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరం అయిన సహాయం అందిస్తున్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+