జూనియర్‌ కుప్పన్న: మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ (ఫోటోలు)

హైదరాబాద్: న‌టి, నిర్మాత‌, టెలివిజ‌న్ వ్యాఖ్యాత‌గా పేరొందిన మంచుల‌క్ష్మి అన్నిరంగాల్లోనూ త‌న‌దైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడూ మంచు ల‌క్ష్మినే క‌నిపిస్తుంది, ఆమె భ‌ర్త ఎక్కువ‌గా ఎక్క‌డా క‌నిపించ‌డు అనుకునే వాళ్ల కోస‌మే ఏమో గానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన తన భ‌ర్త ఆనంద్‌తో కలిసి హోటల్ పరిశ్రమలో అడుగుపెట్టారు.

చెన్నై, బెంగళూరుకు చెందిన జూనియర్‌ కుప్పన్న ఫ్రాంచైజీని తీసుకొని హైటెక్‌ సిటీలో నెలకొల్పారు. ఈ ఫ్రాంచైజ్‌లో మొద‌టి రెస్టారెంట్‌ను హైద‌రాబాద్‌లోని హైటెక్ సిటీలో సినీనటుడు మోహన్‌బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ నాకు ఎప్ప‌టినుంచో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ పెట్టాలని తన కోరికను కూతురు, అల్లుడు తీర్చారన్నారు.

మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ

మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ


పైవ్ స్టార్ హోటల్ పెట్టాలన్న నా కోరికను మా తండ్రి కి చెప్ప‌గా, ఆయ‌న హోట‌ల్ ఎందుకు న‌లుగురికి ఉప‌యోగ‌ప‌డే విధంగా ఏదైనా స్కూల్ క‌ట్టించు అన్నారు.

 మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ

మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ


ఈ క్రమంలో నేను శ్రీ విద్యానికేత‌న్‌ను మొద‌లుపెట్టి నా తండ్రి కోరికను నెర‌వేర్చాను. కానీ నా కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది.

 మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ

మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ

ఇప్పుడు నా కోరిక‌ను మా అమ్మాయి ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌, అల్లుడు ఆనంద్ నెర‌వేరుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జూనియ‌ర్ కుప్ప‌న్న ఫ్రాంచైజీని ఎంచుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన ఆయన ఇక్క‌డ దొరికే ప్ర‌తి వంటకం, ఎటువంటి కెమిక‌ల్స్ లేకుండా, ఒకసారి తింటే నెల‌జీతం మొత్తం ఈ రెస్టారెంట్‌కే అంకితమిచ్చేలా ఉంటుంద‌న్నారు.

మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ

మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ


అనంతరం మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ ఈ రెస్టారెంట్‌ను హైద‌రాబాద్‌ నగరవాసులకు మొద‌టిగా తామే ప‌రిచ‌యం చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. చెన్నై, బెంగుళూరు ల‌లో జూనియ‌ర్ కుప్ప‌న్న్ రెస్టారెంట్ గురించి, ఆ రుచి తెలియ‌ని వారుండ‌రని అన్నారు.

మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ

మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ


నేను బెంగుళూరు వెళ్తే కుప్ప‌న్నకు వెళ్ల‌కుండా, వచ్చేదే ఉండ‌దని చెప్పారు. మెడిటేష‌న్ మైండ్‌కు, కుప్ప‌న్న క‌డుపు‌కు అనే ఫార్ములాను మాత్రం అక్క‌డున్న‌ప్పుడు నేను త‌ప్ప‌కుండా ఆచ‌రించే ఫార్ములా అని చెప్పారు.

 మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ

మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ


మా అదృష్టం కొద్దీ కుప్ప‌న్న ఓన‌ర్ నాకు మంచి ఫ్రెండ్ కావ‌డంతో, మాకు ఈ ఫ్రాంఛైజ్ దొరికిందని ఆమె అన్నారు.

 మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ

మోహన్ బాబు కోరిక తీర్చిన 'మంచు' లక్ష్మీ


ప్ర‌తి ఒక్క‌రికి ఇంటి రుచిని మ‌రిపించే విధంగా ఈ రెస్టారెంట్‌ను హైద‌రాబాదీయుల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంచు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+