చిన్నారుల భద్రతపై సాయితేజ్ ఆందోళన: సీఎం రేవంత్ రెస్పాన్స్ ఇదే
చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ టాలీవుడ్ హీరో సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej)సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సాయి ట్వీట్‌కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియా ప్రమాదకరంగా మారిందని, పిల్లల ఫొటోలు/వీడియోలు పోస్ట్ చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సాయి తేజ్ తల్లిదండ్రులకు సూచించారు.
'కట్టడి చేయలేనంతగా సోషల్ మీడియాలు క్రూరంగా, భయానకంగా మారిపోయాయి. కొన్ని మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని పేరెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి. మీ పిల్లల ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. ఎందుకంటే, సోషల్ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదు' అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు సాయిత్ తేజ్.

కొంతమంది యూట్యూబర్లు పిల్లల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూనో.. పిల్లలతో కలిసి పేరెంట్స్ చేసిన వీడియోలపైనో అవమానకరంగా కామెంట్లు చేస్తున్నారని, ఆ విషయమై స్పందిస్తూ సాయితేజ్ తాజా పోస్టు చేసినట్లు తెలుస్తోంది. కాగా, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసినందుకు హీరో తేజ్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
చిన్నారుల భద్రతపై ఆలోచించాల్సిన అవసరముందని సాయితేజ్ మరో పోస్టులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను అభ్యర్థించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఎక్స్(ట్విట్టర్) ఖాతాలను ట్యాగ్ చేశారు.
Thank you for bringing to our notice this issue @IamSaiDharamTej garu.
— Revanth Reddy (@revanth_anumula) July 7, 2024
Child safety is utmost priority for our Govt. Will look into this incident and take appropriate action. https://t.co/5fTG4ZiQYi
ఈ నేపథ్యంలో సాయితేజ్ ట్వీట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల భద్రత తమ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు సీఎం రేవంత్. ఈ అంశంపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ విషయంపై స్పందించారు. చిన్నారుల భద్రతపై రాజీ లేదన్నారు. సమస్యను తమ దృష్టికి తెచ్చినందుకు సాయితేజ్ కి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications