Venkatesh: ఎన్నికల ప్రచారానికి హీరో వెంకటేష్.. ఎక్కడంటే..!

చాలా పార్టీలు ప్రచారానికి సినీతారలను తీసుకొస్తారు. గతం లో కూడా చాలా మంది సినీ యాక్టర్లు పార్టీల తరఫున ప్రచారం చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ తో పాటు అన్న కొడకు వరుణ్ తేజ్ కూడా ప్రచారం చేశారు. హైపర్ ఆది కూడా పవన్ తరఫున్ ప్రచార బరిలోకి దిగారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.

ఇటు తెలంగాణలో కూడా సినీ ప్రముఖలతో ప్రచారం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో హీరో విక్టరీ వెంకటేష్ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రాఘురాం రెడ్డి బరిలో దిగారు. రామసహయం రెడ్డి గెలుపు కోసం వెంకటేష్ ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి.

Hero Victory Venkatesh is likely to campaign for Congress in Khammam

వెంకటేష్ కూతురు అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకున్న సంగతి తెలసిందే. దీంతో వియ్యంకుడి గెలుపు కోసం వెంకీ రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రఘరాం రెడ్డికి వెంకటేష్ ప్రచారం కలిసొస్తుందని భావిస్తున్నారు. రఘరాం రెడ్డి మరో కుమారుడికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డను ఇచ్చారు. దీంతో రాఘురాం రెడ్డికి రెడ్డితో పాటు ఖమ్మ సామాజిక వర్గం మద్దతు లభించే అవకాశం ఉంది.

వెంకటేష్ మే 7న ఖమ్మం ప్రచారం చేస్తారని స్థానికంగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు. వియ్యంకుడు రఘురాం రెడ్డి విజయం కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ కృషి చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+