టీడీపీలో చేరిన హీరోయిన్ రేవతి చౌదరి: సిటీ నుంచే బరిలోకి?
హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ రేవతి చౌదరి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమక్షంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పసుపు కండువా కప్పి రేవతిని పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీలోకి రేవతి
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో ఎన్టీఆర్ భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమై చర్చించారు. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలోనే రేవతి టీడీపీలో చేరారు.

హైదరాబాద్ నగరం నుంచే పోటీ..
పార్టీ అవకాశం ఇస్తే ఈ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి రేవతి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కాగా,
విజయవాడకు చెందిన రేవతి చౌదరి నాగార్జున యూనివర్సిటీలో చదివారు. 1998లో మిస్ విజయవాడగా ఎంపికయ్యారు. ఆ తరువాత సినీ రంగంపై మక్కువతో హైదరాబాద్‌కు మకాం మార్చారు.

సినీరంగంపై మక్కువతో హైదరాబాద్‌కు మకాం..
శివాజీ హీరోగా నటించిన సినిమాతో రేవతి తెరంగేట్రం చేశారు. అయితే పలు కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. నందమూరి తారకరత్న హీరోగా చేస్తున్న ‘కాకతీయుడు' అనే సినిమాలో కూడా రేవతి నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టిట్లీ బాధితులకు తెలంగాణ టీడీపీ విరాళం
శ్రీకాకుళం జిల్లా టిట్లీ తుఫాను బాధితులకు టీటీడీపీ నేత నందీశ్వర్ గౌడ్ ఆర్థిక సాయం చేశారు. రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన చెక్కును అందజేశారు. తెలుగు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా సాయం చేయాలన్నదే తన ఉద్దేశమని అన్నారు.












Click it and Unblock the Notifications