వాహ్... స్టార్ హోటల్స్ ను తలపించేలా హైటెక్ సిటీ, హఫీజ్ పేట రైల్వేస్టేషన్లు!
భారతదేశంలో రైల్వేస్టేషన్ల రూపురేఖలు మార్చడానికి భారతీయ రైల్వే అమృత్ భారత్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను అధునాతన హంగులతో అభివృద్ధి చేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టిన భారతీయ రైల్వే అమృత భారత స్టేషన్స్ స్కీమ్ లో భాగంగా వాటి రూపురేఖలను మార్చేస్తోంది.
తెలంగాణలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు
తెలంగాణ రాష్ట్రంలోని హైటెక్ సిటీ, సికింద్రాబాద్, మలక్ పేట, మల్కాజ్గిరి, నాంపల్లి, హఫీజ్ పేట, ఉప్పుగూడ, బేగంపేట, ఉందా నగర్, యాకుత్ పురా, మేడ్చల్, జడ్చర్ల, కాజీపేట జంక్షన్, కరీంనగర్, జనగామ, కాచిగూడ, తాండూర్, ఆదిలాబాద్, వికారాబాద్, బాసర, భద్రాచలం రోడ్ లను అభివృద్ధి చేస్తుంది.

ఈ స్టేషన్ల రూపు రేఖలు మార్చేస్తున్న రైల్వే
అంతేకాదు మిర్యాలగూడ, గద్వాల్, నల్గొండ, కామారెడ్డి, ఖమ్మం, లింగపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, నిజామాబాద్, రామగుండం, పెద్దపల్లి, షాద్నగర్, జోగులాంబ గద్వాల్, వరంగల్, యాదాద్రి రాయగిరి, జహీరాబాద్ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న భారతీయ రైల్వే అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అధునాతన హంగులను సమకూరుస్తుంది.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్న రైల్వే
మొత్తం దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి 2023లో ప్రారంభించిన ఈ పథకం రైల్వే స్టేషన్ లను అద్భుతమైన సౌధాలుగా తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం ఈ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నారు.
Hi-tech City Railway Station in Telangana State is being redeveloped as part of the Amrit Bharat Station Scheme
— South Central Railway (@SCRailwayIndia) November 27, 2024
👉 Project cost ~ ₹26.6 cr
👉 A glimpse at the proposed designs of the upcoming redeveloped Hi-tech City Station#AmritBharatStations#NayeBharatKaNayaStation pic.twitter.com/bfsikNnRil
సోషల్ మీడియాలో ప్రతిపాదిత డిజైన్ షేర్ చేసిన దక్షిణమధ్య రైల్వే
ఈ ప్రాజెక్టు వ్యయం 26.6 కోట్లు కాగా ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కు సంబంధించి త్వరలో పునర్నిర్మాణం జరగనున్న ప్రతిపాదిత డిజైన్లను దక్షిణ మధ్య రైల్వే తన సోషల్ మీడియా ఖాతాలో ఉంచింది. అత్యధిక వసతులతో అధునాతన హంగులతో దీన్ని నిర్మాణం చేపడుతున్నట్టు తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలతో అర్థమవుతుంది.
Redevelopment of Hafizpeta Railway Station in Telangana State under Amrit Bharat Station Scheme
— South Central Railway (@SCRailwayIndia) November 27, 2024
👉 Project cost ~ ₹26.6 cr
👉 A glimpse at the proposed designs of the upcoming redeveloped Hafizpeta Station#AmritBharatStations#NayeBharatKaNayaStation pic.twitter.com/J6ydunogKN
హఫీజ్ పేట రైల్వే స్టేషన్ ప్రతిపాదిత డిజైన్ పోస్ట్
ఇక ఇదే సమయంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద హఫీజ్ పేట రైల్వే స్టేషన్ ని కూడా పునరాభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్న రైల్వే ఈ రైల్వే స్టేషన్ ప్రతిపాదిత డిజైన్లను కూడా ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయం కూడా 26.6 కోట్ల రూపాయలుగా పేర్కొంది. ఈ అమృత్ భారత్ స్టేషన్ల డిజైన్లు చూస్తే భారతదేశంలో భవిష్యత్తు రైల్వే రూపురేఖలు ఇట్టే మనకు అర్థమవుతాయి.












Click it and Unblock the Notifications