హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఈ 4 రైళ్ల స్టాప్ పై రైల్వే కీలక నిర్ణయం..!

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్ ప్రెస్ రైళ్లకు హైదరాబాద్ హైటెక్ సిటీ నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఇక్కడి ఐటీ ఉద్యోగులు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ (Hi-Tech City Station) నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ స్టేషన్లో పలు రైళ్లకు స్టాప్ కోసం రైల్వే శాఖ వద్ద వినతులు వస్తూనే ఉన్నాయి. దీంతో రైల్వేశాఖ ఎప్పటికప్పుడు పలు రైళ్లకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో స్టాప్ ఇచ్చే విషయంలో నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది.

ఉత్తరాంధ్రలో 14 రైళ్ల టైమింగ్స్ మార్పు..! స్టేషన్ల వారీగా ఇలా..!
ఉత్తరాంధ్రలో 14 రైళ్ల టైమింగ్స్ మార్పు..! స్టేషన్ల వారీగా ఇలా..!

ఇదే క్రమంలో ఇప్పటికే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న నాలుగు ఎక్స్ ప్రెస్ రైళ్లకు గతంలో ఇచ్చిన తాత్కాలిక స్టాప్ ను పొడిగించాలని దక్షిణ కోస్తా రైల్వే నిర్ణయించింది. వీటిలో నరసాపురం-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ (17255), లింగంపల్లి-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ (17256), కాకినాడ టౌన్-లింగంపల్లి కోకనాడ ఎక్స్ ప్రెస్ (12775), లింగంపల్లి-కాకినాడ టౌన్ కోకనాడ ఎక్స్ ప్రెస్ (12776) రైళ్లు ఉన్నాయి. వీటికి ప్రస్తుతం ఉన్న తాత్కాలిక స్టాప్ ను పొడిగించారు.

Hi-Tech City Station Temporary Stoppage Extended for 4 Daily Express Trains
Visakhapatnam–LTT Express: విశాఖ-లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు కొత్త స్టాప్..!
Visakhapatnam–LTT Express: విశాఖ-లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు కొత్త స్టాప్..!

నరసాపురం-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో ప్రతీరోజూ తెల్లవారుజామున 4.45కు ఆగనుంది. అలాగే లింగంపల్లి-నరసాపురం ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 9.08కి ఆగనుంది. కాకినాడ-లింగంపల్లి కోకనాడ ఎక్స్ ప్రెస్ ఉదయం 7.10కి ఆగనుంది. ఈ మూడు రైళ్లూ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 10 వరకూ హైటెక్ సిటీ స్టేషన్లో ప్రతీ రోజూ ఆగుతాయి. అలాగే లింగంపల్లి-కాకినాడ టౌన్ కోకనాడ ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 7.08కి ఆగనుంది. ఈ రైలు డిసెంబర్ 18 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకూ ఆగేలా స్టాప్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+