తెలంగాణ ప్రజలకు హైఅలర్ట్.. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు !

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ప్రజలకు షాక్ ఇస్తుంది. అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తుండడం అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో వానలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (IMD) జూలై 21 (ఆదివారం), 22 (సోమవారం) రోజులకు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.

12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

ముఖ్యంగా 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏ ఏ జిల్లాలకు అంటే..

high-alert-for-people-of-telangana-and-heavy-rains-for-the-next-two-days

ఆదిలాబాద్

కుమురం భీమ్ ఆసిఫాబాద్

మంచిర్యాల

కరీంనగర్

పెద్దపల్లి

వరంగల్

మెదక్

కామారెడ్డి

జయశంకర్ భూపాలపల్లి

మహబూబ్‌నగర్

నాగర్‌కర్నూల్

హనుమకొండ

జూలై 21 (ఆదివారం):
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.

జూలై 22 (సోమవారం):
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు.

నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి వంటి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం.

ఇక హైదరాబాద్ నగరంలో ఇప్పటికే వర్షాల ప్రభావంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. డ్రైనేజీ సమస్యలు, వరద నీటితో కూడిన రోడ్లు నగరవాసులకు నరకం చూపిస్తున్నాయి. మరింత వర్షం కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలకు సూచనలు..

  • వర్ష బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలి
  • నదులు, వాగులు, చెరువుల దగ్గర తిరగవద్దు.
  • రహదారుల్లో నీరు నిలిచిన చోట్లలో వాహనదారులు అజాగ్రత్తగా నడపవద్దు
  • విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలి
  • పిల్లలు, వృద్ధులు, పెంపుడు జంతువులను ఇంటి వద్ద రక్షణతో ఉంచాలి
  • వాతావరణ శాఖ అప్డేట్స్‌ను గమనించాలి.
  • అత్యవసరమైతే తప్ప బయటకు ప్రయాణించవద్దు
  • సహాయక బృందాలకు అధికారులకు పూర్తి సహకారం అందించాలి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+